Maruti Cars త్వరలో విడుదల కానున్న మారుతి కొత్త కార్లు ఇవే.. ఒక్కో కారులో ఎన్నో ప్రత్యేకతలు
దేశీయ మార్కెట్లో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(Upcoming Maruti Suzuki Cars) కస్టమర్లలో మంచి ఆదరణ పొందింది. గత నెలలో ఫోర్ వీలర్ విక్రయాల్లో ఎప్పటి లాగే దూకుడు కొనసాగిస్తోంది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మొదటి పది వాహనాల్లో ఎనిమిది మారుతి సుజుకికి చెందినవే.
మార్కెట్‌లో మారుతి సుజుకి(Maruti Suzuki) అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. మార్కెట్లో తన బలమైన స్థానాన్ని కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో మారుతి బ్రాండ్ నుంచి మరో ఆరు కార్లు త్వరలో విడుదల కానున్నాయి. మరి ఆ కార్లేంటి, వాటి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

న్యూజెన్ మారుతి సుజుకి స్విఫ్ట్, డిజైర్: మారుతి కార్ల సేల్స్‌లో ప్రస్తుతం ఛాంపియన్‌గా ఉన్న స్విఫ్ట్(New Gen Maruti Swift And Dzire) మరియు డిజైర్.. త్వరలో సెడాన్ వెర్షన్‌తో పాటు ఫేస్‌లిఫ్ట్‌తో రాబోతుంది. సిల్హౌట్ రెండు కార్లకు ఒకే విధంగా ఉన్నప్పటికీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్‌లు అప్‌డేట్ అవ్వడంతో పాటు, ఫ్రంట్, రియర్ బంపర్ రీడిజైన్‌తో రానున్నాయి. టెక్నికల్ ఫీచర్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
మారుతి స్విఫ్ట్ అండ్ డిజైర్‌లో ఇంజిన్ అదే 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌తో ఆధారితంగా కొనసాగుతుంది. ఇది 90 PS గరిష్ఠ శక్తి వద్ద 113 Nm గరిష్ఠ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్‌లతో పాటు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్ & డిజైర్ హైబ్రిడ్: ఇందులో ఓల్డ్ జెన్ హైబ్రిడ్ నుంచి కొత్తగా కనిపించేందుకు(New Gen Swift & Dzire Hybrid) డిజైన్‌లో కొన్ని మార్పులు రానున్నాయి. అయితే పవర్‌ట్రెయిన్‌లో మార్పులు ఉన్నాయి. 1.2-లీటర్ NA ఇంజిన్, బ్యాటరీ ప్యాక్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. NA ఇంజిన్ 90PS వద్ద 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఎలక్ట్రిక్ మోటార్ 13.5PS వద్ద 30 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇందులో గ్రాండ్ విటారాలోని అదే CVT యూనిట్‌తో వస్తుందా లేదా ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన 6-స్పీడ్ AMT ఉపయోగించబడుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు.

మారుతి సుజుకి eVX: మారుతి సుజుకి eVX(Maruti Suzuki eVX) ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఇది 2025 లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.25 లక్షలు ఉండొచ్చు. మారుతి సుజుకి eVX 5-సీటర్ SUV. ఇందులో 60 kWh బ్యాటరీ ప్యాక్‌తో డ్యూయల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. పూర్తి ఛార్జ్‌తో 550 కి.మీల వరకు రేంజ్ ఇస్తుంది.
కొత్తగా అప్‌డేట్ చేయబడిన Nexon EV ఫీచర్ల ఆధారంగ మారుతి సుజుకి eVX లో ఒక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మరియు ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఇది MG ZS EV, హ్యుందాయ్ కోనా, మహీంద్రా XUV400 మరియు టాటా నెక్సాన్ EV మ్యాక్స్ వంటి వాటితో పోటీ పడనుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా XL (7-సీటర్): గ్రాండ్ విటారా XL(Maruti Suzuki Grand Vitara XL) అనేది ప్రస్తుతం విక్రయంలో ఉన్న మోడల్ 7-సీటర్ వెర్షన్. స్ట్రాంగ్ డైనమిక్‌లతో అదే ఛాసిస్‌తో వస్తుంది. వీల్‌బేస్ పొడవుగా ఉంటుంది. 3వ వరుసను జోడించడం మినహా ఇంటీరియర్‌లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. 2వ వరుసలో కేవలం XL6లో ఉన్న కెప్టెన్ సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుత గ్రాండ్ విటారాలో ప్రీమియం క్యాబిన్ ఉండటంతో డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు మెటీరియల్‌లు ఒకే విధంగా ఉండొచ్చు. ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ప్రస్తుత మోడల్ నుంచి తీసుకున్నారు. ఇందులో 2 ఇంజిన్ ఆప్షన్‌లు ఉంటాయి. 115bhpని eCVT గేర్‌బాక్స్‌తో జత చేసిన 1.5L బలమైన హైబ్రిడ్ మరియు 103bhp ఉత్పత్తి చేసే 1.5L K15C మైల్డ్ హైబ్రిడ్, వీటిలో ఏదైనా ఉండొచ్చు.

Grand Vitara లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉంటుంది. ఇక గ్రాండ్ విటారాలో ఫీచర్లను చూసుకుంటే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉండొచ్చు. 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్‌తో అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుందని భావించవచ్చు.


Click it and Unblock the Notifications








