ఖరీదైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసిన మహేష్ బాబు.. హైదరాబాద్‌లో ఇప్పటివరకూ ఏ హీరోకి ఈ కలర్ కారు లేదు..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం వారికి మాత్రమే కాదు.. వారు వాడే వాహనాలకు కూడా అభిమానుల్లో క్రేజ్ ఉంటుంది. లగ్జరీ స్టేటస్‌తో కార్లు ఉంటాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి కొత్త రేంజ్ రోవర్ వచ్చి చేరింది. ఇది అన్ని రేంజ్ రోవర్ల మాదిరిగా కాకుండా ఈ కారు పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. విభిన్నంగా బంగారు(గోల్డ్) రంగు రేంజ్ రోవర్ ఎస్పీ మహేష్ కొనుగోలు చేశారు. ఇది అరుదుగా లభించే మోడల్. దీని ధర 5.4 కోట్లుగా ఉంది.

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొనుగోలు చేసిన కొత్త గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ ఎస్పీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ ఇటీవలే ఈ క్లాస్‌గా కనిపించే కారును కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్‌ను సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తి మహేష్ మాత్రమే కావడం విశేషం.
హైదారాబాద్‌లో నివసిస్తున్న సినీ, వ్యాపార ప్రముఖుల కార్లను పరిశీలిస్తే హైదరాబాద్‌లో మొట్టమొదటి గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ SUVని కొనుగోలు చేసిన నటుడు కేవలం మహేష్ మాత్రమం. మహేష్ బాబు కార్ల కలెక్షన్స్‌లో కూడా ఇదే అత్యంత ఖరీదైన కారు. కళ్లు చెదిరే గోల్డ్ కలర్, ఖరీదైన ధరతో ఈ కారు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఈ కారు కొనుగోలుతో మహేష్ హుందా మరింత పెరిగిపోయింది.

మహేష్ బాబు మాత్రమే కాకుండా చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, బాలకృష్ణ వంటి ప్రముఖ నటులు కూడా రేంజ్ రోవర్‌ను కలిగి ఉన్నారు. కానీ హైదరాబాద్‌లో బంగారు రంగులో రేంజ్ రోవర్ కలిగి ఉన్న ఏకైక వ్యక్తి మహేష్‌బాబు మాత్రమే. ఈ కారు విలాసవంతమైన ఫీచర్లను కలిగి ఉండటంతో నటీనటులకు చాలా ఫేవరెట్ SUV గా నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి గుంటూరు కారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. మొదటి హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా ఇప్పటికే దాదాపు షూటింగ్ కూడా పూర్తయింది. పూజా హెగ్డేను రెండవ నటిగా భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తొలగించారు.

తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం నుంచి నటి పూజా హెగ్డేని తప్పించి, ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ మీకాక్షి చౌదరిని తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌లో థ్రిల్ లేకపోవడంతో చాలా భాగాలను రీ-షూట్ చేయాలని మరియు స్టంట్ కంపోజర్‌ను కూడా మార్చాలని మహేష్ బాబు కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.



Click it and Unblock the Notifications








