త్వరలో మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్‌ కారు.. ఆకట్టుకొనే డిజైన్‌ సహా 230 కి.మీ రేంజ్!

భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీగా ఆదరణ లభిస్తుంది. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల డిమాండ్‌లకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సంస్థలు చాలా వరకు తమ మోడల్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

భారత్‌ మార్కెట్‌లో మంచి ఆదరణ చూస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల సెగ్మెంట్‌లోని అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాబోయో జపాన్ మొబిలిటీ షో 2023 తన కొత్త ఈవీను సుజుకి ప్రదర్శనకు ఉంచనుందని తెలుస్తోంది.

Suzuki eWX Electric car Concept

జపాన్‌ మొబిలిటి షోలో సుజుకి తరఫున eWX ప్రదర్శనలో ఉండబోతుంది. అవి నెక్స్ట్‌ జెనరేషన్‌ WagonR ఎలక్ట్రిక్‌ కాంపాక్ట్‌ ఎలక్ట్రిక్‌ SUVగా భావిస్తున్నాం. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ ఎలక్ట్రిక్‌ను 2022 సంవత్సరంలోనే విడుదల చేసేందుకు ప్రణాళికలు వేసుకొంది. అయితే కరోనా సహా ఇతర కారణాలతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని తెలుస్తోంది. అయితే పరిస్థితులను దాటుకొని వచ్చి ఈవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచుతోంది.

త్వరలో జపాన్‌లో జరగనున్న మొబిలిటీ షోలో మారుతి eWX ఎలక్ట్రిక్‌ మినీ వ్యాగన్‌ఆర్‌ 2023ను ప్రదర్శించనుంది. ఈ కొత్త Suzuki eWX ఎలక్ట్రిక్‌ కారు 3395 mm పొడవు, 1475 mm వెడల్పు, 1620 mm ఎత్తును కలిగి ఉంది. ఈ కారు సింగిల్‌ ఛార్జింగ్‌తో 230 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని సుజుకి చెబుతోంది.

Suzuki eWX Electric car Concept

ఈ eWX ఎలక్ట్రిక్‌ కారు ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్రంట్‌ బంపర్‌, సైడ్‌ క్లాడింగ్‌ సహా బాక్సీ ప్రొఫైల్‌, కాంపాక్ట్‌ డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సుజుకి, టయోటా డైహట్సు సంయుక్తంగా ఈ వాహనాన్ని అభివృద్ధి చేశాయి. స్పెసియో కాన్సెప్ట్‌, స్పెసియో కస్టమ్‌ కాన్సెప్ట్‌ ప్లాట్‌ఫారంలు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.

సుజుకి eWX ఎలక్ట్రిక్ కారు ధర ఎంత ఉండవచ్చనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ కారు టాటా టియోగో ఈవీ, సిట్రోయెన్‌ eC3 ఎలక్ట్రిక్‌ హ్యాచ్‌బ్యాక్‌ల ధరల మధ్యలో ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే సింగిల్‌ ఛార్జింగ్‌తో 230 కి.మీ రేంజ్‌ ఇవ్వగలదని సంస్థ చెబుతోంది. ఫలితంగా చాలా మంది కస్టమర్ల సాధారణ అవసరాలు తీర్చగలిగే అవకాశం ఉంటుంది.

Suzuki eWX Electric car Concept

ఈ కాన్సెప్ట్‌ మోడల్‌ సాధారణ ప్రజలు అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. సుజుకి సంస్థ 2023 టోక్యో మోటార్ షోలో ఈ eWX కాన్సెప్ట్‌ మోడల్‌లను ప్రదర్శించేందుకు అన్ని సిద్ధం చేస్తోంది. దీంతోపాటు నెక్ట్‌ జనరేషన్‌ సుజుకి స్విఫ్ట్‌ కారును ఈ కార్యక్రమంలోనే ఆవిష్కరించనున్నారు. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 5, 2023, 14:17 [IST]
English summary
Suzuki ewx concept will be showcased in japan mobility show 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+