Tata Altroz iCNG మార్కెట్‌లోకి కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ లాంచ్.. అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయ ధరలో..
ఇటీవలి కాలంలో టాటా కార్లకు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇప్పుడు తన CNG(కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) వాహన విభాగాన్ని మరింత విస్తరిస్తోంది. తాజాగా టాటా ఆల్ట్రోజ్ iCNG ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది.
గతంలో టియాగో, టిగోర్ మోడళ్లకు సీఎన్‍జీ వెర్షన్‍ను తీసుకొచ్చిన టాటా మోటార్స్.. ఇప్పుడు ఆల్ట్రోజ్‍కు సీఎన్‍జీ వెర్షన్‍ను అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రానిక్ సన్‍రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫయర్ సహా మరిన్ని ఫీచర్లతో ఈ కొత్త Tata Altroz iCNG కారు మార్కెట్‌లోకి ప్రవేశించింది. పెట్రోల్, సీఎన్‍జీ.. రెండిట్లో దేనితోనైనా ఈ ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు నడుస్తుంది.

కొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG హ్యాచ్‌బ్యాక్ స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. ఇందులో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ ఉంది. రెండు సీఎన్‍జీ సిలిండర్లను ఈ కారు లగేజ్ ఏరియాలో టాటా మోటార్స్ ఇచ్చింది. దీంతో స్టాండర్డ్ ఆల్ట్రోజ్‍తో పోలిస్తే ఈ ఐసీఎన్‍జీ వెర్షన్‍లో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. Tata Altroz iCNG కారును డైరెక్టుగా సీఎన్‍జీ మోడ్‍లోనే ఆన్ చేసే సదుపాయం ఉంటుంది.
కొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG 210 లీటర్ బూట్ స్పేస్‌తో వస్తుంది. స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారు బూట్ స్పేస్ 345 లీటర్లు. ఈ ఇంజిన్ CNG మోడ్‌లో 72.5 bhp శక్తి వద్ద 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజిన్ 85 bhp వద్ద 113 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ CNG కారు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా జత చేయబడింది.

ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్‍లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‍లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో కార్ ప్లే కనెక్టివిటీ సపోర్ట్ ఫీచర్లు టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారులో ఉంటాయి. ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుకవైపు ఏసీ వెంట్స్, హైట్‌ను అడ్జస్ట్ చేసుకునే వీలుండే డ్రైవర్ సీటు, వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రానిక్ సన్‍రూఫ్, వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైర్ లాంటి అధునాతన ఫీచర్లను ఈ కారు అందిస్తోంది.
ప్రస్తుతం కొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG కారు ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. XE, XM+, XM+ (S), XZ, XZ+ (S), మరియు XZ+ O (S) వేరియంట్లు అందుబాటులు ఉన్నాయి. ఒపేరా బ్లూ, డౌన్‍టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ కలర్ ఆప్షన్‍లో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ అందుబాటులోకి వచ్చింది.

టాటా ఆల్ట్రోజ్, సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్, సరసమైన ధరలతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధర ఎక్స్ షోరూమ్‌లో రూ. 7.55 లక్షలు పలుకుతోంది. XZ+ O (S) టాప్-స్పెక్ మోడల్ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ. 10.55 లక్షలు పలుకుతోంది. వేరియంట్లను బట్టి ఈ రేట్లు ఉంటాయి.
ఈ అధునాతన ఫీచర్ల ద్వారా టాటా ఆల్ట్రోజ్ కార్ల విక్రయాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. CNG మోడల్ ఎక్కువ మంది వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తుంది. దీనితో, టాటా ఆల్ట్రోజ్ కారు టాటా కంపెనీకి అమ్మకాల్లో మరింత దోహదపడుతుందని చెప్పవచ్చు. భారతదేశంలో CNG ప్యాసింజర్ వాహన రంగంలోకి ప్రవేశించిన టాటా మోటార్స్ ఇప్పుడు తన పెట్టుబడిని మరింత పెంచుకోవాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications








