టాటా ఆల్ట్రోజ్‌ కొత్త వేరియంట్లు విడుదల.. ఈ సెగ్మెంట్‌లో గట్టి పోటీ...!!

Tata Altroz కారు కొత్త వేరియంట్లు విడుదల అయ్యాయి. ఆల్ట్రోజ్‌ లైనప్‌ను బలోపేతం చేసేందుకు XM, XM(S) వేరియంట్లను టాటా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు ప్రధానంగా యువతను ఆకర్షిస్తాయని టాటా మోటార్స్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ రెండు వేరియంట్లు అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయని పేర్కొంది.

టాటా ఆల్ట్రోజ్‌ XM వేరియంట్‌ మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌, అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీట్‌, ఎలక్ట్రికల్‌ ఆపరేటెడ్‌ ORVM, R16 పుల్‌ వీల్‌ కవర్‌ సహా ప్రీమియం లుకింగ్‌ డ్యాష్‌బోర్డును కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లకు అదనంగా XM(S) వేరియంట్‌ ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌తో వస్తుంది. 9 అంగుళాల టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

Tata Altroz

టాటా ఆల్ట్రోజ్‌ కారు గ్లోబర్ NCAP సేఫ్టీ రేటింగ్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ను పొందింది. పెద్దల రక్షణలో 16.13/17 పాయింట్లు మరియు పిల్లల రక్షణలో 29/49 పాయింట్లను కలిగి ఉంది. హ్యాచ్‌బ్యాక్‌ యాక్సెసరీస్ కేటలాగ్‌ నుంచి కస్టమర్‌లు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను ఎంచుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆల్ట్రోజ్‌ మాన్యువల్‌ పెట్రోల్‌ వేరియంట్‌ 4 పవర్‌ విండోస్‌ మరియు రిమోట్‌ కీలెస్‌ ఎంట్రీ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఆల్ట్రోజ్‌ XM, XM(S) వేరియంట్లు రెండు కూడా 1.2 లీటర్‌ రెవోట్రాన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. 6000rpm వద్ద 88.2bhp శక్తి, 3300 rpm వద్ద 115Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. మరియు 5- స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. టాటా ఆ‌ల్ట్రోజ్‌ XM వేరియంట్ ధర రూ.6.90 లక్షలు, XM(S) వేరియంట్‌ రూ.7.35 లక్షల (ఎక్స్‌షోరూం) ధరను కలిగి ఉంది.

Tata Altroz

SUV మోడళ్ల రాకతో భారత్‌ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల విక్రయాలు స్వల్పంగా క్షీణించాయి. అయితే ఆ లోటును భర్తీ చేసేందుకు అన్ని సంస్థలు కీలక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌ మారుతి సుజుకి బాలెనో అగ్రస్థానంలో ఉంది. ప్రీమియం హ్యచ్‌బ్యాక్‌ కార్లు అంటే మారుతి బాలెనో, హ్యుందాయ్‌ ఐ20 కార్లు మాత్రమే అనే సమయంలో టాటా మోటార్స్‌ సంస్థ ఆల్ట్రోజ్‌ ఎంట్రీ ఇచ్చింది.

అద్భుతమైన డిజైన్, మెరుగైన భద్రతా ఫీచర్లతో కారు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కారు మారుతి, హ్యుందాయ్‌లతో సహా టయోటా గ్లాంజాతోను పోటీపడనుంది. 2020 ప్రారంభంలోనే టాటా ఆల్ట్రోజ్‌ క్రాష్‌ టెస్టులో 5 స్టార్‌ రేటింగ్‌ను సొంతం చేస్తుంది. ఆటోమేటిక్‌ వేరియంట్‌ అందుబాటులో లేకపోయినా.. విక్రయాల్లో గరిష్ఠ సంఖ్యను నమోదు చేసింది.

Tata Altroz

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 20, 2023, 19:36 [IST]
English summary
Tata altroz launched two new variants at rs 6 90 lakh starting price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+