ఆటో ఎక్స్‌పో 2023: అదిరిపోయే లుక్‌లో Altroz Racer ఆవిష్కరించిన టాటా మోటార్స్
2023 ఆటో ఎక్స్‌పోలో దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్టియస్ట్ వెర్షన్ 'ఆల్ట్రోజ్ రేసర్' (Altroz Racer) ను ఆవిష్కరించింది. టాటా ఆల్ట్రోజ్ యొక్క ఈ కొత్త స్పోర్టియస్ట్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుందాం.
కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ సాధారణ ఆల్ట్రోజ్ మాదిరిగానే కనిపించినప్పటికీ ఇందులో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. అయితే ప్రధానంగా గమనించవలసిన అంశం ఏమిటంటే వాయిస్ అసిస్ట్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌రూఫ్. నిజానికి ఈ ఫీచర్ సాధారణ ఆల్ట్రోజ్ లో లేదు. అంతే కాకుండా ముందు భాగంలో ఉన్న బ్లాక్ బోనెట్ మీద మరియు బ్లాక్ రూప్ మీద రెండు వైట్ కలర్ రేసింగ్ చారలు చూడవచ్చు.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ అనేది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కంటే కూడా కొంత విస్తరించి ఉంటుంది. ఇందులో ఎక్కువ బ్లాక్ కలర్ గమనించవచ్చు. ఇందులో బానెట్ కి ఇరువైపులా హెడ్‌లైట్లు ఉన్నాయి. అంతే కాకుండా సైడ్ ప్రొఫైల్ లో అల్లాయ్ వీల్స్ డిజైన్ స్టాండర్డ్ ఆల్ట్రోజ్ మాదిరిగానే ఉన్నప్పటికీ, రేసర్ ఆల్-బ్లాక్ ఫినిషింగ్ పొందుతాయి. వెనుక భాగంలో బ్రాండ్ లోగో దానికి కింద ఆల్ట్రోజ్ బ్యాడ్జ్ వంటివి వాటితో పాటు షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ స్పాయిలర్ ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ యొక్క ఇంటీరియర్ కూడా చాలా ఆధునికంగా అనిపిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంది. ఇది కొత్త సాఫ్ట్‌వేర్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి వాటికి మద్దతు ఇస్తుంది. అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. లోపల కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కొత్త ఆల్-బ్లాక్ అపోల్స్ట్రే చూడవచ్చు.

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్, ఆల్ట్రోజ్ iTurbo మాదిరిగానే 1.2 లీటర్, త్రీ సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది ఇప్పుడు 120 హెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. గతంలో టాటా ఆల్ట్రోజ్ ఇంజిన్ 110 హెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ టార్క్ అందించేది. దీన్ని బట్టి చూస్తే టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎక్కువ పవర్ డెలివరీ చేస్తుంది.
ఆల్ట్రోజ్ రేసర్ iTurbo లోని ఇంజిన్ పొందినప్పటికీ గేర్‌బాక్స్ మాత్రం వేరుగా ఉంటుంది. iTurbo ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది, కానీ ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అయితే ఇందులో ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే ఈ ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి పనితీరుని అందిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే సమాచారం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అంతే కాకుండా కంపెనీ ఈ ఎడిషన్ యొక్క ధరలు కూడా వెల్లడించలేదు. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో టాటా ఆల్టోజ్ రేసర్ ఎడిషన్ రూ. 9.99 లక్షల నుంచి రూ. 12.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైతే హ్యుందాయ్ i20 N లైన్ కి ప్రత్యర్థిగా ఉంటుంది.
టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ మాత్రమే కాకుండా టాటా పంచ్ CNG వెర్షన్, టాటా హారియర్ EV, టాటా కర్వ్, టాటా సియెర్రా మొదలైన ఆధునిక మోడల్స్ కూడా ప్రదర్శించింది. దీనిని బట్టి టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో రానున్న రోజుల్లో చాలా వరకు అప్డేటెడ్ మోడల్స్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా మోటార్స్ లాంచ్ చేసే వాహనాలను గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








