భారీగా పెరిగిన టాటా కార్ల ధరలు.. ఏఏ కార్ల ధరలు పెరిగాయంటే..?
మధ్య తరగతి కుంటుంబాలు అత్యంత ఇష్టపడే టాటా మోటార్స్ ఇప్పుడు మరింత ప్రియం కానున్నాయి. వాటి ధరలు పెంచుతున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ పై ధరలను పెంచింది. వీటిలో టాటా ఆల్ట్రోజ్, టాటా పంచ్, టాటా సఫారి, టాటా హారియర్, టాటా టియాగో, టాటా టిగోర్ కార్లు ఉన్నాయి.
పెంచిన ధరల్లో టాటా హారియర్, టాటా సఫారీ ధరలను దాదాపు రూ.25,000 (ఎక్స్-షోరూమ్) వరకు సంస్థ పెంచేసింది. మిగతా కార్లపైన రూ.10,000 వేల నుంచి 15,000 మధ్య మోడళ్లు డీజిల్, పెట్రోల్ వేరియంట్ ఆధారంగా ధరలను నిర్ణయించింది. ఈ పెరిగన ధరలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

పెంచిన కార్ల ధరలు మోడళ్లు వారీగా..
టాటా ఆల్టోజ్..
టాటా ఆల్టోజ్ పెట్రోల్ మోడల్ ధర రూ.10,000లకు కంపెని పెంచింది. మరోవైపు, డీజిల్ వెర్షన్ ధర రూ.15,000గా ధరను నిర్ణయించింది. అలానే ఈ కారు మోడళ్లలోని టర్బో-పెట్రోల్ వేరియంట్ ధర రూ.15,000 వరకు పెంచినట్లు సంస్థ తెలిపింది. ఈ మూడు వేరియెంట్లలోని ఆల్టోజ్ కార్లను కొనాలనుకునే వారు అదనంగా ఈ పెరిగిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
టాటా పంచ్..
టాటా పంచ్ మైక్రో SUV ధరను కూడా కంపెనీ రూ.10,000 వరకు పెంచింది. 2021లో ఈ కారును టాటా విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ కారు అమ్మకాల్లో దూసుకెళ్తుంది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన రెండవ వాహనంగా టాటా పంచ్ నిలించింది. దీనికంటే ముందు స్థానంలో టాటా నెక్సాన్ ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే పంచ్ కజరంగ ఎడిషన్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే.

కాంపాక్ట్ సెడాన్ విభాగంలోని టాటా టిగోర్ ధరలను కంపెనీ పెంచేసింది. అందులోని మోడల్ వేరియంట్ ను బట్టి రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ధర పెరిగింది. టిగోర్ మోడల్ లోని పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ వంటి మూడు వెర్షన్లు ప్రస్తుతం అంటుబాటులో ఉన్నాయి. అయితే టాటా టియాగో పెట్రోల్ వెర్షన్‌పై రూ.15,000 వరకు ధర పెరిగింది.
ఇక CNG వెర్షన్‌లో XE, XM, XT, XZ ప్లస్ వంటి వేరియంట్స్ రేట్లను రూ.15,000 వరకు పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. టాటా టియాగో NRG XT వేరియంట్ ధర రూ.12,000గా.. XZ వేరియంట్ ధర రూ.15,000గా పెరిగింది. ఈ మోడళ్లపై కూడా ధరల్నీ పెంచుతూ కంపెనీ ఆశ్చర్యానికి గురిచేసింది.

టాటా హారియర్ ADAS బుకింగ్ ప్రారంభం..
టాటా మోటార్స్ టాటా హరియర్ ADAS(అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్), సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ఫీచర్స్ ని తీసుకువచ్చిన మోడల్ కి బుకింగ్స్ ని ఆ కంపెనీ ప్రారంభించింది. జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో టాటా హారియర్ ని ఆ సంస్థ సరికొత్త హారియర్ ని ప్రదర్శించింది. ఈ నూతన SUV మల్టిపుల్ కలర్ ఆప్షన్ లో లభ్యం కానుంది.
బ్లాక్, బ్లూ, ట్రాపికల్ మిస్ట్, రెడ్, వైట్ అండ్ గ్రే వంటి కలర్స్‌లో ఈ కారు లభిస్తుంది. మహింద్రా XUV700, MG హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్, కియా సెల్టోస్ వంటి ఇతర కంపెనీల కార్లకు పోటీగా టాటా హరియర్ ను ఆ సంస్థ మార్కెట్ లో తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ కారు బుకింగ్స్ ప్రస్తుతం హాట్ కేకుల్లా కొనసాగుతున్నాయి.
వారంటీ పెంపు
మరోవైపు తాజాగా BS6 ఫేజ్ II శ్రేణిలో ప్యాసింజర్ వాహనాలను E20 కంప్లైంట్, RDE ఇంజన్ తో సంస్థ పరిచయం చేసింది. రెండు సంవత్సరాలకు 75,000 కి.మీలు, మూడు సంవత్సరాలకు 1 లక్ష కి.మీల వరకు కార్ల వారంటీని పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఇది కొంచెం వాహనదారులకు ఊరట కల్పించే అంశంగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








