Tata Curvv SUV టెస్టింగ్ ఫోటోలు వైరల్.. 500 కి.మీ రేంజ్ సహా కీలక ఫీచర్లు?
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రసిద్ధ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న టాటా సంస్థ కస్టమర్ల అవసరాలు, ఆలోచనలకు తగినట్లుగా కొత్త మోడల్ కార్లను విడుదల చేస్తోంది. టాటాకు చెందిన అనేక హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీలు మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్నాయి. టాటా కర్వ్ SUV (Tata Curvv SUV) టెస్టింగ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
2024 నాటికి ఈ కారును విడుదల చేసేందుకు టాటా సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీని ఇప్పటికే చాలాసార్లు పరీక్షించారు. ఈ కారు డిజైన్ అధునాతనంగా ఉంది. ఈ కారు ముందు బంపర్ ఆకర్షిస్తోంది. నెక్సాన్ EV తరహా LED DRLలను కలిగి ఉంది.

టాటా కర్వ్ SUV గ్రిల్ ఆకట్టుకుంటోంది. టాటా కర్వ్ ఎస్‌యూవీ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది. స్పై ఫోటో ఆధారంగా ఈ కారు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, పీలర్ మౌంటెడ్ ORVM లు షార్క్ ఫిన్ యాంటెనా వంటివి ఉన్నాయి.
ఆకట్టుకొనేలా..: ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. మరియు అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లైస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ఫ్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ సహా అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది.

రెండు వేరియంట్లు : టాటా కర్వ్ ఎస్‌యూవీ టెస్టింగ్.. పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ మోటార్‌తో నడిచిందా అనేది తెలియలేదు. అయితే ఈ ఎస్‌యూవీ కొత్త ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 1.2లీటర్ T-GDi టర్చో పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 125ps శక్తి, 225Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది.
500 కి.మీ రేంజ్!: ఈ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ మోటార్ భారీ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌పై 500 కి.మీ రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఈ కారు ధరపై టాటా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే పెట్రోల్ వేరియంట్ రూ.10.50 లక్షలు, ఎలక్ట్రిక్ కారు రూ.20 లక్షలకు లభిస్తుందని తెలుస్తోంది.

టాటా కర్వ్ వాహనానికి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్, సిట్రస్ C3 ఎయిర్‌క్రాస్, మారుతి సుజికి గ్రాండ్ విటారా, ఎంజీ ఆస్టన్ వంటి కార్లతో పోటీపడనుంది. ప్రస్తుతం టాటా కర్వ్ ఎస్‌యూవీ టెస్టింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వచ్చే సంవత్సరం విడుదల కానుందని తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








