క్రాష్ టెస్ట్‌లో టాటా హారియర్, సఫారీ కార్లకు 5 స్టార్ రేటింగ్.. పిల్లలు, పెద్దల ప్రొటెక్షన్ విభాగంలో భేష్
గ్లోబల్ NCAP ఇటీవల టాటా మోటార్స్‌కు చెందిన టాటా హారియర్, టాటా సఫారీ ఎస్‌యూవీలకు క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ క్రాష్ టెస్ట్‌లో చెందిన హారియర్, సఫారీ ఎస్‌యూవీలు 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి.
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న కార్ల జాబితాలో ఇప్పుడు టాటా హారియర్(Tata Harrier), టాటా సఫారీ(Tata Safari) ఫేస్‌లిఫ్ట్‌లు చేరాయి. గ్లోబల్ NCAP ప్రొటోకాల్, కఠినమైన టెస్టింగ్ ఏజెన్సీకి అనుగుణంగా ఈ కార్లను టాటా మోటార్స్ రూపొందించింది. అయితే ఈ జాబితాలో టాటాకు చెందిన ఇతర ప్రముఖ కార్లు కూడా ఉన్నాయి.

ఇప్పటికే టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, పంచ్ మోడల్‌లు 5 స్టార్ రేటింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే.. కాగా టాటా టియాగో, టాటా టిగోర్ ఎస్‌యూవీలు 4 స్టార్ రేటింగ్(Global NCAP)లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్వదేశీ తయారీ సంస్థ కస్టమర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని దీని ద్వారా స్పష్టమవుతోంది.
కాగా టాటా హారియర్‌ను 2019లో మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. టాటా సఫారీ 2021లో ప్రారంభమైంది. ఇటీవల వాటి అప్‌డేట్లను టాటా మోటార్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వాటిని మా డ్రైవ్‌స్పార్క్ టీం.. టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. అయితే గ్లోబల్ NCAP ద్వారా ఇచ్చే రేటింగ్‌ల కోసం టాటా ఇప్పుడు కొత్త ఫేస్‌లిఫ్ట్ వాహనాలను మాత్రమే క్రాష్ టెస్ట్‌కు పంపింది. కొత్త హారియర్, సఫారీ బాడీ షెల్స్‌ను మాత్రం పాత మోడల్ మాదిరిగానే రూపొందించారు.

ఇక గ్లోబల్ NCAP లో నిర్వహించిన క్రాష్ టెస్ట్ విషయానికి వస్తే, కొత్త 2023 టాటా హారియర్, సఫారీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలో 34 పాయింట్లకు గాను 33.05 స్కోర్ చేశాయి. క్రాష్ టెస్ట్ సమయంలో, ఈ రెండు వాహనాలు డ్రైవర్, ప్రయాణీకుల తల మరియు మెడ రక్షణలో మెరుగైన ఫలితాలు కనబరిచాయి. డ్రైవర్ మరియు ప్రయాణీకుల ఇద్దరికి చెస్ట్ సేఫ్టీ విషయంలో మంచి మార్కులు సాధించాయి.
ఇక సైడ్ ఇంపాక్ట్ టెస్టింగ్‌లో సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లు తల, ఛాతీ, పొత్తికడుపు, పెల్విస్‌కు హై ప్రొటెక్షన్‌ను కల్పించాయి. ఫిట్‌మెంట్ అవసరాలకు అనుగుణంగా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లను ఈ SUVలలో స్టాండర్డ్‌గా అందించారు. ఇక సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లలో తల మరియు పెల్విస్‌కు హై సేఫ్టీ ప్రొటెక్షన్, చెస్ట్‌కి, పొత్తికడుపుకు తగిన రక్షణ కల్పించినట్లుగా నివేదించబడింది.

క్రాష్ టెస్ట్‌లో టాటా హారియర్, సఫారీ రెండు SUVల యొక్క బలమైన బాడీ షెల్ స్థిరంగా ఉన్నట్లు గుర్తించబడింది. ఇంకా అధిక లోడింగ్‌లను తట్టుకోగల సామర్థ్యం ఉండటంతో.. హారియర్ మరియు సఫారి ఫేస్‌లిఫ్ట్‌లు 49 పాయింట్లలో 45 పాయింట్లను సంపాదించాయి. ఇక ఛైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి.
చైల్డ్ రిస్ట్రెయింట్ సిస్టమ్(CRS) ఇన్‌స్టాలేషన్‌తో చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో అద్భుతమైన పనితీరు కనబరచింది. ఇందుకు 12 కి 12 మార్కులు సాధించింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 18-నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల పిల్లలను సూచించే చైల్డ్ డమ్మీలను ఉపయోగించారు. టెస్ట్‌లో వెనుక సీట్లో ఉన్న రెండు డమ్మీ బొమ్మలు తమ స్థానాల్లో సురక్షితంగా కూర్చున్నట్లు నివేదించబడింది.

ఫ్రంటల్ క్రాష్‌లో కూడా చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ ద్వారా పిల్లలను రక్షించింది. ఇంకా సైడ్ ఇంపాక్ట్ క్రాష్‌లో కూడా CRS పూర్తి రక్షణను అందించింది. కాగా టాటా హారియర్, ఫేస్‌లిఫ్ట రెండవ వరుస సీట్లపై ISOFIX మౌంటు పాయింట్లను కలిగి ఉండటం ఉండటం ద్వారా ఇది పిల్లల భద్రతను మెరుగుపరుస్తుందని గుర్తించింది.


Click it and Unblock the Notifications








