Tata Harrier EV టాటా హారియర్ ఈవీ న్యూ లుక్ రివీల్.. ఆకట్టుకుంటున్న కొత్త డిజైన్..
ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా కార్ల ఉత్పత్తిలో దూసుకుపోవడమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆరు నెలల క్రితం టాటా హారియర్ ఈవీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించగా.. ఇప్పుడు మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.
మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్‌లో టాటా.. కార్లను ఉత్పత్తి చేస్తూ మార్కెట్‌లో విక్రయాల్లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో టాటా తన కొత్త ఎలక్ట్రిక్ కారు టాటా హారియర్ ఈవీకి సంబంధించిన పలు చిత్రాలను తన సామాజిక మాధ్యమ ఖాతాలో రివీల్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రజల స్పందనను తెలుసుకునేందుకునేందుకు ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేసినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో.. 2023 ఆటో ఎక్స్‌పోలో హారియర్ SUV కి సంబంధించి పూర్తి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ ప్రాజెక్ట్ నడుస్తోందని, రానున్న రోజుల్లో మార్కెట్‌లోకి విడుదల అవుతుందని ధ్రువీకరించింది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో హారియర్ EV కాన్సెప్ట్.. కాంట్రాస్ట్ బ్లాక్ ఎలిమెంట్స్‌తో వైట్ పెయింట్ స్కీమ్‌ను ఆవిష్కరించింది.
కాగా టాటా మోటార్స్ ఇప్పుడు రివీల్ చేసిన ఫొటోలను పరిశీలిస్తే టాటా హారియర్ ఈవీ డ్యూయల్ టోన్ బ్రాంజ్ మరియు వైట్ థీమ్‌ను కలిగి ఉంది. ఈ SUV కొత్త స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో ఫుల్ విడ్త్ రన్నింగ్ ఎల్‌ఈడీ బార్, ఎన్‌క్లోజ్‌డ్ గ్రిల్‌తో వస్తుంది. అయితే ఎక్స్‌పో ప్రదర్శనలో టాటా హారియర్ ఈవీ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ మరియు ఆల్‌వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది.

టాటా హారియర్ తన సంప్రదాయ ఇంధన మోడల్‌కు ఎలక్ట్రిక్ వేరియంట్ దగ్గరగా ఉన్నప్పటికీ భిన్నంగా ఉండేలా ఈవీలో కొన్ని మార్పులు చేసింది. స్టాండర్డ్ ICE హారియర్ కంటే హారియర్ ఈవీలో డిజైన్‌లో చాలా మార్పులు చేసింది. ఎక్స్‌టీరియర్ ఆకర్షణీయమైన లుక్‌తో వస్తుంది.
టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారు వెహికల్ టు లోడ్ (V2L) మరియు వెహికల్ టు వెహికల్ (V2V) ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కానీ ఈ ఎస్‌యూవీకి సంబంధించి ఖచ్చితమైన స్పెసిఫికేషన్లను ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఈ ఎస్‌యూవీ నుంచి దాదాపు 400 నుంచి 500 కి.మీల రేంజ్‌ను ఆశించవచ్చు. బ్యాటరీ కెపాసిటీ 60kwh గా ఉండే అవకాశం ఉంది.

టాటా హారియర్ ఈవీ నేరుగా మార్కెట్‌లోకి రానున్న మహీంద్రా XUV 700 తో పోటీపడనుంది. కాగా టాటా హారియర్ ఈవీ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి విడుదల కానున్నట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీ ధర ఎక్స్ షోరూమ్‌లో రూ. 22 లక్షల నుంచి రూ. 28 లక్షల మధ్య భారీ బడ్జెట్ కారుగా ఉండే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








