ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల కానున్న టాటా హారియర్.. వచ్చే ఏడాది కల్లా రోడ్ల మీదికి

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా తన కొత్త 'హారియర్ EV కాన్సెప్ట్‌' ఆవిష్కరింది. కంపెనీ ఈ ఆటో ఎక్స్‌పో 2023 లో ఆవిష్కరించిన నాలుగు కాన్సెప్ట్‌లలో హారియర్ EV కాన్సెప్ట్‌ ఒకటి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కంపెనీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన హారియర్ EV కాన్సెప్ట్‌ మోడల్ 2024 నాటికి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారు ఒమేగా ఆర్కిటెక్చర్‌ మీద ఆధారపడి ఉంటుంది. కావున ఇది అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది ఎలక్ట్రిక్ కారు కావున ఫ్యూయెల్ ట్యాంక్ ప్రాంతం మొత్తం భారీ మార్పులకు గురైంది. అంతే కాకుండా ఇంటీరియర్ కూడా ఫ్లాట్ ప్లోర్ మాదిరిగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల కానున్న టాటా హారియర్

టాటా మోటార్స్ తన హారియర్ EV కాన్సెప్ట్‌ యొక్క బ్యాటరీ కెపాసిటీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ స్పెసిఫికేషన్‌ వంటి వాటిని గురించి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారులో డ్యూయల్ మోటార్ సెటప్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ ఉంటుందని కంపెనీ ప్రస్తావించింది. అంతే కాకుండా హారియర్ EV వెహికల్-టు-లోడ్ మరియు వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది.

కొత్త టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారులో 60 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ బ్యాటరీ ఫ్యాక్స్ కంటే కొంత పెద్దదిగా ఉంటుంది, కావున రేంజ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 400 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉంటుందని భావించవచ్చు. అయితే ఇంకా ఖచ్చితమైన గణాంకాలు వెల్లడి కాలేదు.

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల కానున్న టాటా హారియర్

టాటా హారియర్ EV కాన్సెప్ట్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో అదే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ పొందుతుంది. అయితే హెడ్‌ల్యాంప్‌ల ఎగువ ఉన్న ఎలిమెంట్స్ కలుపుతూ కొత్త LED లైట్ బార్‌ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో కొత్త బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ మరియు రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ కూడా ఉన్నాయి. సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ కూడా బ్లాంక్డ్ ఆఫ్ ప్యానెల్ కలిగి కొంత రీడిజైన్ చేయబడి ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్ లో పెద్దగా మార్పులు లేవనే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈవి బ్యాడ్జ్‌లు, ఫెండర్‌లపై ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు పెద్ద కాన్సెప్ట్ లాంటి వీల్స్ వంటి వాటిని గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ లో టెయిల్ గేట్ వెడల్పు మొత్తం విస్తరించి ఉండే LED లైట్ బార్‌ ఉంటుంది. అదే సమయంలో ఎల్ఈడీ లైట్ బార్ కింద హారియర్ ఈవి అనే బ్యాడ్జ్ కూడా ఉంటుంది. ఇది చూపరులకు ఎలక్ట్రిక్ వెర్షన్ అని స్పష్టంగా చెబుతుంది.

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల కానున్న టాటా హారియర్

టాటా హారియర్ ఈవి లోపలి భాగంలో కూడా చాలా మార్పులు జరిగినట్లు స్పష్టంగా గమనించవచ్చు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ వంటివి లభిస్తాయి. అంతే కాకుండా ఇందులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎయిర్ అప్‌డేట్‌ వంటి మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తి కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది, కావున ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 11, 2023, 19:42 [IST]
English summary
Tata harrier ev unveiled at auto expo 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+