టాటా నుంచి షాకింగ్ న్యూస్.. కమర్షియల్ వాహనాల ధరలు పెంపు, ఆ రోజు నుంచే.!!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీదారు టాటా మోటార్స్(Tata Motors Prices Hike) కొత్త ఏడాదికి ముందు షాకింగ్ సమాచారాన్ని ప్రకటించింది. టాటా కార్ల నాణ్యతతో కస్టమర్లలో విపరీతమైన అభిమానాన్ని సంపాదించింది టాటా మోటార్స్.. తాజాగా ధరల పెంపు నిర్ణయంతో కస్టమర్లపై ఆర్థిక భారం పడనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ ఆటో మార్కెట్ టాప్ 5 జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ నేపథ్యంలో ముడి సరుకు ధరలు పెరగడంతో వాహనాల తయారీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. దీంతో వచ్చే నష్టాలను పూడ్చుకునేందుకు చాలా కార్ల కంపెనీలు కొత్త ఏడాదిలో ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

భారత మార్కెట్లో టాప్ కంపెనీలు మారుతీ సుజుకీ, మహీంద్రా, హోండా, ఆడి, హ్యుందాయ్ కంపెనీలు ఇప్పటికే తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీల ప్రకటన అనంతరం టాటా మోటార్స్ కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పుడు టాటా నుంచి మరో కీలక ప్రకటన బయటకు వచ్చింది.
టాటా మోటార్స్‌కు చెందిన కార్ల ధరల పెంపుతో పాటు తమ కంపెనీకి చెందిన కమర్షియల్ వెహికల్స్ ధరలు కూడా పెరగననున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. దీంతో టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలైన లారీలు, ట్రక్కుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కార్లు, వాణిజ్య వాహనాల ధరల పెంపు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.

టాటా వాణిజ్య వాహనాల ధరలు 3 శాతం పెరగనున్నట్లు సంస్థ వెల్లడించింది. మొత్తంమీద టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు కొత్త ఏడాదిలో పెరగనున్నాయి. వాహనాల తయారీకి కావాల్సిన ముడిసరుకు ధరలు పెరగడం, ఉత్పత్తి ఖర్చు పెరగడం వంటి కారణాలతో గతంలో జరిగిన నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.
టాటా మోటార్స్‌కు చెందిన అన్ని రకాల వాణిజ్య వాహనాలకు ధరల పెంపు వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. హ్యాచ్‌బ్యాక్ టియాగో నుంచి ప్రీమియం SUVల వరకు వివిధ రకాల ప్యాసింజర్ వాహనాలను టాటా మోటార్స్ విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధర రూ. 5.6 లక్షలు మొదలుకొని రూ. 25.94 లక్షల వరకు ఉంటోంది. అయితే వీటి ధర వచ్చే కొత్త సంవత్సరం జనవరి నుంచి మారనున్నాయి.

కాగా కొత్త ఏడాది(2024)లో టాటా మోటార్స్ నుంచి పలు కొత్త కార్లు విడుదల కానున్నాయి. టాటా కర్వ్(Tata Curvv) ఇటీవల రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఎలక్ట్రిక్ పవర్డ్ టాటా కర్వ్ SUV మోడల్ విడుదల కానుంది. ఆ తర్వాత పెట్రోల్ వేరియంట్‌ను 2025 లో ప్రవేశపెట్టనున్నారు. అంతే కాకుండా టాటా పంచ్(Tata Punch EV) ఈవీ వచ్చే ఏడాదిలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొత్త టాటా పంచ్ ఈవీలో పెద్ద టచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, అల్లాయ్ వీల్స్‌తో పాటు ఆకర్షణీయమైన LED DRL లాంటి అద్భుతమైన ఫీచర్లు ఉండొచ్చు. టాటా పంచ్ ఈవీ ఫుల్ ఛార్జింగ్‌పై 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం. రూ.12 లక్షల ప్రారంభ ధరలో విడుదల కానుందని సమాచారం.
టాటా నుంచి మరో ఎస్‌యూవీ హారియర్(Tata Harrier EV) EV కూడా వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో టాటా హారియర్ ఈవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించారు. ఈ కారులో డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ ఉండొచ్చని సమాచారం. ఈ కారులో ఉపయోగిస్తున్న అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జింగ్‌పై 500 కి.మీ రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








