Tata Sumo రీఎంట్రీ ఇవ్వనుందా.. ఎప్పుడు లాంచ్ కానుంది.. ఎండీ కీలక ప్రకటన?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ (Tata motors) నుంచి 7-సీటర్‌ MPVను లాంచ్‌ కానుందని తెలుస్తోంది. టాటా మోటార్స్ ఎండీ ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. అప్పటి నుంచి ఈ కారు స్పెసిఫికేషన్లు సహా ఇతర ఫీచర్లపై చర్చ జరుగుతోంది.

సుమో పేరుతో..?: అయితే ఆసక్తికరంగా ఈ కొత్త కారుకు సుమో అనే పేరు పెట్టవచ్చని (Tata Sumo) తెలుస్తోంది. టాటా సుమో కారు ఇప్పటికే బాగా ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో.. ఇదే పేరుతో ఎంపీవీని లాంచ్ చేయాలని టాటా మోటార్స్‌ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.

Tata sumo

కొత్త సెగ్మెంట్‌లో వాహనాన్ని అందించేందుకు టాటా సంస్థ ఆసక్తిగా ఉందని టాటా మోటార్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే టాటా ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌, కాంపాక్ట్‌ సెడాన్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌, కంపాక్ట్‌ SUV మరియు సఫారీ, హారియర్‌ వంటి మిడ్‌ సైజ్‌ SUVలను కలిగి ఉంది.

ఎంపీవీ సెగ్మెంట్‌లో : ఎర్టిగా మరియు కారెన్స్‌ వంటి కార్లతో పోటీ పడేందుకు టాటా మోటార్స్‌ వద్ద ప్రస్తుతం ఎటువంటి కార్లు లేవు. అందువల్ల ఎంపీవీ సెగ్మెంట్‌లో ఓ వాహనాన్ని లాంచ్‌ చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. టాటా సంస్థ MPVను విడుదల చేయాలని భావిస్తే.. 2025 చివరలో లేదా 2026 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.

Tata sumo MPV news

కొత్త టాటా సుమో ప్రస్తుతం టాటా ఎస్‌యూవీల డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. హారియర్‌/ సఫారీ మరియు నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌లు ఒకే విధమైన హెడ్‌లైట్‌ సెటప్‌ను కలిగి ఉన్న ఫ్రంట్‌ ఎండ్‌ను కలిగి ఉంటాయి. రానున్న వాహనం కూడా ఇదే తరహా డిజైన్ సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది.

టాటా సుమో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో రావచ్చు. కనెక్టెడ్‌ DRL మరియు కనెక్టడ్‌ LED టెయిల్‌ ల్యాంప్‌లతో రావచ్చు. పాత సుమో తరహాలో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంచవచ్చు. మరియు 18- అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను పొందవచ్చు. 210 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే సుమో పాత మోడల్‌ నుంచి టెయిల్ మౌంటెడ్‌ స్పేర్‌ వీల్ వంటి పీచర్లను పొందవచ్చు.

Tata sumo new car

పాత సుమో బాక్సీ డిజైన్‌తో కొత్త టాటా ఎస్‌యూవీల డిజైన్‌ సహా ఇతర ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కారు MPVగా తీసుకొస్తున్న నేపథ్యంలో 7 మరియు 8 సీటింగ్‌ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లగ్జరీ లుక్‌ కోసం రెండో వరుసలో కెప్టెన్‌ సీట్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

టాటా నుంచి రానున్న కొత్త సుమో ఇంటీరియర్‌ పాత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 12.3 అంగుళాల లేదా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ సిస్టమ్‌, టచ్‌ ఆధారిత AC కంట్రోల్‌ మరియు టాటా లోగోతో కూడిన 2-స్పోక్‌ లేదా 4- స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ను కలిగి ఉండవచ్చు.

Tata to lauch sumo

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Sunday, November 26, 2023, 9:52 [IST]
English summary
Tata motors expected to launch popular sumo as new mpv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+