Offers on Tata Cars కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ టాటా కార్లపై భారీ డిస్కౌంట్..

భారత్‌లో ప్రముఖ కార్ల తయారీదారుగా గుర్తింపు పొందిన టాటా మోటార్స్ బ్రాండ్లకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ కార్ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు అనడంలో సందేహం లేదు. కాగా ఈ నెలలో టాటా మోటార్స్‌ వాహనప్రియుల కోసం బంపర్ ఆఫర్‌ ప్రకటించింది.

టాటా భారతదేశంలో నమ్మకమైన కార్ల తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. జూలై నెలలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 50,000 వరకు ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగదారులు దీనిని సద్వినియోగం చేసుకుంటే భారీ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. పూర్తి సమాచారం మీ కోసం ఈ కథనంలో..

Tata-Cars-Offers

టాటా కంపెనీ ఎంట్రీ లెవల్ కారు టియాగో అందిస్తున్న డిస్కౌంట్ ప్రయోజనాలను పరిశీలిస్తే.. ఈ కారు కొనుగోలుదారులకు రూ.35,000 తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ తగ్గింపుతో ప్రయోజనం కలగనుంది. ఇంకా టియాగో సీఎన్‌జీ వెర్షన్‌పై భారీ తగ్గింపు మొత్తం రూ. 45,000 ప్రయోజనం చేకూరనుంది.

టాటా ఆల్టోజ్ కారుపై కూడా వినియోగదారులకు భారీ తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తోంది. పెట్రోల్ వెర్షన్ కొనుగోలు చేసేవారికి రూ.23,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ మరియు రూ.3,000 కార్పొరేట్ తగ్గింపు ప్రకటించింది.

Tata-Tiago-iCNG

ఆల్టోజ్‌ డీజిల్‌ ఎడిషన్ రూ.28,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. టాటా ఆల్టోజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.60 లక్షల నుండి రూ. 10.74 లక్షల మధ్య ఉంది.

ఈ కారు వేరియంట్ల బట్టి లీటరుకు 18.05 కి.మీ నుంచి 23.64 kmpl మైలేజీని ఇస్తుంది. భద్రత పరంగా చూసుకుంటే ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ఆటో పార్క్ లాక్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంది.

Tata-Harrier

ఈ జూలై నెలలో టాటా టిగోర్ కారుపై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. పెట్రోల్ వేరియంట్‌పై రూ.35,000 తగ్గింపు ప్రయోజనం ఉంది. రూ.20,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

టిగోర్‌ iCNG కారుపై గరిష్ఠంగా రూ.50,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో రూ.35,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌లో రూ.6.30 లక్షల నుంచి రూ.8.90 లక్షల ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Tata-Safari

టాటా మోటార్స్‌కు చెందిన ప్రముఖ కాంపాక్ట్ SUV నెక్సాన్ కేవలం రూ.3,000 కార్పొరేట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. టాటా హారియర్ మరియు సఫారీ కార్లపై రూ. 25,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ మరియు రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది.

కాగా జూలై నెలలో టాటా కంపెనీ పంచ్, టియాగో EV మరియు నెక్సాన్ EVలపై ఎలాంటి తగ్గింపును ప్రకటించలేదు. అయితే, దాదాపు అన్ని ఇతర మోడళ్లపై భారీ తగ్గింపు ఉంది. ఈ తగ్గింపు సౌకర్యాలు రాష్ట్రం బట్టి మారుతూ ఉంటాయి. ఆఫర్లు, ఇతర వివరాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మీ సమీప డీలర్‌షిప్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 12, 2023, 13:30 [IST]
English summary
Tata motors offers big discounts on various models in july month full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+