Tata Motors కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. మరోసారి కమర్షియల్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల కంపెనీల్లో టాటా మోటార్స్(Tata Motors) ఒకటి. టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్లను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాల(Tata Motors Commercial Vehicles) విక్రయాల్లో కూడా టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు షాకింగ్ న్యూస్ అందించింది టాటా మోటార్స్.
కస్టమర్లకు క్వాలిటీ సర్వీసును అందిస్తున్న టాటా మోటార్స్ మరోసారి కమర్షియల్ వాహనాల(Commercial Vehicles) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా మెటార్స్ తెలిపిన వివరాల ప్రకారం తమ కంపెనీకి చెందిన వాణిజ్య వాహనాల ధరలు 3 శాతం పెరగనున్నాయి. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు సమాచారం. ఈ ధరల పెంపు టాటా మోటార్స్‌కు చెందిన అన్ని వాణిజ్య వాహనాలకు వర్తిస్తుందని గమనించాలి. దీంతో టాటా మోటార్స్ నుంచి కమర్షియల్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే షాకింగ్ వార్త అనే చెప్పవచ్చు.
ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2023లో టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలను పెంచడం ఇది మూడో సారి. గతంలో అంటే ఈ ఏడాది జనవరిలో కమర్షియల్ వాహనాలకు 1.2 శాతం ధర పెంచింది. ఆ తర్వాత మార్చిలో 5 శాతం పెంచింది.

అక్టోబర్ 1 నుంచి 3 శాతం ధర పెరుగుతున్నట్లు ప్రకటించడంతో ఇప్పటికి మూడు సార్లు ధర పెంచింది. దీపావళి పండుగ సమీపిస్తుండంతో దేశంలో ఎక్కువగా టాటా మోటార్స్ నుండి వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వారికి, ఈ ధరల పెరుగుదల ఓ రకంగా జేబులకు చిల్లు లాంటిదే.
కియా మోటార్స్(Kia Motors) కూడా ముందుగా ధరల పెంపును ప్రకటించడం ఇక్కడ గమనార్హం. దీని ప్రకారం కియా సెల్టోస్ మరియు కియా కేరెన్స్ ధరలు అనూహ్యంగా పెరగనున్నాయి. కియా మోటార్స్ మరియు టాటా మోటార్స్ తర్వాత మరిన్ని కంపెనీలు దీపావళికి ముందు వాహనాల ధరలను పెంచే అవకాశం ఉంది.
ఈ ధరల పెంపు ప్రకటనలు వినియోగదారులను షాక్‌కు గురిచేస్తున్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి రావడమే ఈ షాక్‌కు ప్రధాన కారణం. అయితే టాటా కమర్షియల్ వాహన శ్రేణిలో ఏస్, ఇంట్రా, యోధ పేరిట పికప్ వెహికల్స్‌తో పాటు ట్రక్కులను టాటా మోటార్స్ విక్రయిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








