Tata Motors Car Price కార్ల ధరల్నీ పెంచిన టాటా.. పెరిగిందే తక్కువే కానీ..!
దేశంలోని టాటా మోటార్స్ ఆటోమోబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కార్లు లేదా వాహనాలకు జనాల్లో క్రేజ్ ఎక్కువ. ఆటోరంగంలో తనదైన ముద్రను వేసుకుంటూ టాటా దూసుకుపోతుంది. తాజాగా ఆ కంపెనీ వినియోగదారులకు సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆ కంపెనీ నుంచి ఎంపిక చేసిన కొన్ని కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
అయితే ధరల పెంపు అధిక మొత్తంలో లేకపోవడం కాస్త ఉపశమనంగా చెప్పవచ్చు. వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు ఇప్పుడున్న ధరలపై 0.6% స్వల్పంగా పెంచింది. పెరిగిన ఇన్ పుట్ ఖర్చుల మేర ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా తెలిపింది. గత ఫిబ్రవరిలోనూ టాటా ICE ఇంజన్ కార్ల ధరలను 1.2% మేర పెంచింది. తాజాగా మరోసారి పెంపుతో వినియోగదారులపై భారం పడనుంది.

మే 1 నుంచి అమలు..
సంస్థ పెంచిన ధరలు మే 1 నుంచి అమలులోకి రానున్నాయి. అధే విధంగా ఈ సంవత్సరం, టాటా కంపెనీ తన వాహనాల అమ్మకాలను ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఇందుకోసం త్వరలోనే కొన్ని కార్లను విడుదల చేయనుంది. ఇప్పటికే వాటికి సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించింది. రాబోయే కార్లలో హారియర్, సఫారీ,నెక్సాన్ SUVలు ఉన్నాయి.. దీనితో పాటు, ఆల్ట్రోజ్ రేసర్, పంచ్ iCNG వెర్షన్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.
టాటా టియాగో..
ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ ఎక్కువగా టియాగో హ్యాచ్‌బ్యాక్ ను విక్రయిస్తోంది. కంపెనీ నుంచి ఎంట్రీ-లెవల్ గా ఉన్న ఈ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు CNG ఎంపికలలో అందుబాటులో ఉంది. ఈ కారు లీటర్ కి 19.0 - 19.01 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ కారు రూ. 5.54 లక్షల నుంచి రూ. 8.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

టాటా ఆల్ట్రోజ్..
భారతీయ మార్కెట్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో కారు టాటా అల్ట్రాజ్. వినియోగదారులకు ఇది కేవలం రూ.6.45 లక్షల నుంచి రూ.10.40 లక్షల ప్రారంభ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ కారు 1.2-లీటర్ సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో పనిచేస్తుంది. లీటర్ కి 18.05 - 23.64 kmpl మైలేజీని ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
టాటా పంచ్..
టాటా నుంచి తాజాగా ఎక్కువ పేరొందిన కారు టాటా పంచ్. ఇది సరసమైన ధరలో వినియోగదారుల్నీ ఆకట్టుకుంటుంది. ఈ కారు భద్రతా పరంగా బెస్ట్ అని చెప్పవచ్చు. ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 6 లక్షల నుండి రూ. 9.47 లక్షల మధ్య ఉంటుంది. అలానే టాటా నెక్సాన్ ఎంట్రీ లెవల్ మోడల్ ప్రారంభ ధర రూ.7.80 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.14.35 లక్షలుగా ఉంది.

టాటా హారియర్..
టాటా హారియర్ ప్రారంభ ధర రూ. 15 లక్షలతో అందుబాటులో ఉంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో అందుబాటులో ఉంది. అలానే సఫారీ ధర రూ. 15.65 లక్షల నుంచి రూ. 25.02 లక్షల మధ్యలో ఉంది. ఇది లీటరుకు 14.08 - 16.14 కిమీ మైలేజీని అందిస్తుంది.
తక్కువ మొత్తంలో టాటా ధరల్నీ పెంచడంతో కస్టమర్ల మీద అధిక భారం ప్రభావం చూపకపోవచ్చు. ప్రస్తుతం దేశంలో చాలా కంపెనీలు కార్ల ధరల్నీ పెంచేశాయి. BS6 ఫేజ్ 2 తప్పనిసరి చేయడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. టాటా ఈ ఏడాదిలో రెండో సారి ధరలను పెంచింది. ఇతర కంపెనీలు కూడా ధరల్నీ పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








