Tata Nano Car కారు లవర్స్‌కి గుడ్‌న్యూస్.. మరోసారి విడుదల కానున్న 'టాటా నానో'.. ఈసారి సరికొత్తగా..!
దేశంలోనే అతిచిన్న కారుగా టాటా నుంచి విడుదలైన నానో కారు సరికొత్త రికార్డు సృష్టించింది. అమ్మకాల్లో ఊహించని విధంగా ఈ కారు తన సత్తాను చాటింది. కారు కొనాలనుకునే సామాన్యులకు ఓ వరంలా విడుదలైన ఈ కారు కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంది.
అయితే కొన్ని భద్రతా దృష్ట్యా ప్రమాణాల దృష్ట్యా ఈ ఉత్పత్తిని సంస్థ నిలిపివేసింది. తాజాగా ఈ కారును మరోసారి విడుదల చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే దీనిపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆటో రంగంలో ఊహాగానాలు వస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కారుగా దీనిని విడుదల చేయనుంది. అతి చిన్న కారుగా రాబోతున్న నానో ఐఈసీ-ఆధారిత ప్లాట్ ఫామ్‌తో వచ్చే అవకాశం ఉంది. కొద్దిపాటి డిజైన్ మార్పులతో దీనిని తీసుకురానుంది. అందరికి సరసమైన ధరలో ఈ కార్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే నానో ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో విడుదల కానుంది.
విడుదలైన తర్వాత ఈ కారు విప్లవాత్మక మార్పులు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టాటా నానో ఎలక్ట్రిక్ కారు బరువు 800 కిలోలు ఉండవచ్చని అంచనా. ఇది గరిష్టంగా 23 bhp వద్ద 85nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటారుతో మార్కెట్ లోకి రానుంది. దీంతోపాటు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశీయ విపనిలోకి చాలా కారులు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లతో విడుదల చేస్తున్నాయి. కాబట్టి నానో ఎలక్ట్రిక్ కారు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం ఒక గంటలో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే నానో ఈవీ మరింత చౌక ధరలో లభిస్తుందని భావిస్తున్నారు. అది కూడా కేవలం రూ.5 లక్షల వరకు ఉండొచ్చుని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని టాటా 2008లో నానోను ప్రవేశపెట్టింది. ఇది ప్రపంచంలోనే చౌకైన కారుగా రికార్డు సృష్టించింది. మొదట్లో పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ కారు.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేక పోయింది. దీంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో 2018లో ఈ కారును సంస్థ నిలిపివేసింది. ఈ కారు ఇప్పటికీ రోడ్లపై తిరుగుతోంది.

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థ నుంచి విడుదలైన టియాగో, నెక్సాన్ ఈవీ కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. టియాగో ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.69 లక్షల నుంచి రూ.11.99 లక్షల మధ్య ఉండనుంది. టాటా నెక్సాన్ ఈవీ రూ.16.99 లక్షల నుండి రూ.30.2 లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అధునాతన ఫీచర్లతో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో అతి చిన్న కారుగా ఎంజీ కామెంట్ ఈవీ కొనసాగుతోంది. ఈ కారు ఏప్రిల్ 26న దేశీయ మార్కెట్లో విడుదల అయింది. దీనికి వస్తున్న ఆదరణను చూసి టాటా నానో ఎలక్ట్రిక్ కారును లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కారు విడుదల తర్వాత, ఇది సంచలనాలు సృష్టిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








