Tata Nexon 2023 అప్‌డేటెడ్ టాటా నెక్సాన్ ఫుల్ రివ్యూ వీడియో..
దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది. అయితే కర్వీ నెక్సాన్‌తో ఎస్‌యూవీ మార్కెట్లోకి ప్రవేశించిన టాటా.. ఇప్పుడు కొత్తగా మరింత టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అప్‌డేటెడ్ టాటా నెక్సాన్(2023 Tata Nexon)ను మార్కెట్లోకి విడుదల చేసింది. జైపూర్‌లో మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేసింది. మరి ఈ కారు ఫీచర్లు, డిజైన్, పర్ఫామెన్స్‌కి సంబంధించి పుల్ రివ్యూ వీడియో మీ కోసం అందిస్తున్నాం.
2023 టాటా నెక్సాన్ కారు ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సరికొత్త నెక్సాన్ SUV, రోడ్డు మీద ఉన్నప్పుడు, అందరి దృష్టి దానిపై ఉండేలా చేస్తుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఇది చాలా మార్పులను పొందింది. ఇక టాటా నెక్సాన్ క్యాబిన్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌తో సరికొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 8-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్‌తో వస్తుంది.
అప్‌డేటెడ్ Tata Nexon SUV వెనుక భాగంలో చాలా అధునాతనంగా ఉంది. Y-ఆకారపు LED టెయిల్‌లైట్లు, కారు వెనుక భాగాన్ని కప్పి ఉంచే లైట్‌బార్‌కి అనుసంధానించబడి, దీనికి విలక్షణమైన రూపాన్ని అందిస్తాయి. ఇది 6 మోనోటోన్ కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అవి ఫియర్‌లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషన్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, డేటోనా గ్రే మరియు ఫ్లేమ్ రెడ్.

టాటా నెక్సాన్ రెండు ఇంజిన్ ఎంపికలతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 118.2 bhp శక్తిని మరియు 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 లేదా 6 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో 113.3 bhp శక్తిని, 260 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








