Offers on Tata Cars ఆ టాటా కార్లపై భారీ ఆఫర్లు.. రూ. 58 వేల వరకు తగ్గింపు..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ నెల(జూన్)లో కార్లపై భారీ డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను ప్రకటించింది. తద్వారా గరిష్ఠంగా వినియోగదారులకు రూ. 58,000 వరకు తగ్గింపు లభించనుంది. టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ మరియు నెక్సాన్ వంటి సీఎన్‌జీ కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.
టాటా అందిస్తున్న ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్‌ఛేంజ్, బోనస్‌లు మరియు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. జూన్ 1 నుంచి జూన్ 30, 2023 మధ్య జరిగే కొనుగోళ్లపై మాత్రమే ఈ ఆఫర్లు మరియు ప్రయోజనాలు వర్తించనున్నాయి. ఈ నెలలో మరింత సరసమైన ధరలో టాటా కారు కొనుగోలు చేసేందుకు ఆఫర్లు వివరాలు మీ కోసం..

టాటా పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పాటు, CNG వేరియంట్‌లపై కూడా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఇతర ప్రయోజనాల రూపంలో లభించనుంది. జూన్ 1 నుంచి జూన్ 30, 2023 మధ్య కారును కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు అందుబాటులోఉండనున్నాయి.
టాటా టియాగో : టాటా టియాగో కారుపై రూ. 53,000 వరకు ఆఫర్ వర్తించనుంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు మరియు రూ. 20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉన్నాయి. రూ. 3000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

టాటా టియాగో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో జత చేయబడింది. టియాగో ధర ప్రస్తుతం ఎక్స్ షోరూమ్‌లో రూ. 5.06 లక్షల నుంచి రూ. 8.11 లక్షల మధ్య ఉంది.
టాటా టిగోర్ : టాటా మోటార్స్ టాటా టిగోర్‌పై రూ. 58,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో మీకు రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ కారుపై దాదాపు రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ లభించనుంది. టిగోర్ బేస్ ధర రూ. 6.30 లక్షలు కాగా డిస్కౌంట్‌లకు ముందు ఎక్స్ షోరూమ్‌లో రూ. 8.90 లక్షలుగా ఉంది.

టాటా ఆల్ట్రోజ్ : ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ఈసారి పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారుకి సంబంధించి CNG వేరియంట్ ఇటీవలే విడుదల కావడంతో, ఈ ఆఫర్లు దీనిపై వర్తించడంలేదు. ఆల్ట్రోజ్ కారుపై రూ. 1500 నగదు తగ్గింపు, రూ. 25,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 5000 కార్పొరేట్ తగ్గింపు వర్తిస్తుంది.
టాటా సఫారి మరియు హారియర్ : ఈ రెండు కార్లపై దాదాపు రూ. 50,000 తగ్గింపు వర్తించనుంది, ఇందులో రూ. 40,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు ప్రకటించింది. పంచ్ మరియు నెక్సాన్ కార్లపై వరుసగా రూ. 10,000, రూ. 20,000 చొప్పున తగ్గింపు వర్తిస్తుంది.

టాటా హారియర్ ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 15 లక్షల నుంచి రూ. 24.07 లక్షల వరకు ఉంది. టాటా సఫారీ ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 15.65 లక్షల నుంచి రూ. 25.02 లక్షల వరకు ఉంది. ఆల్ట్రోజ్ డిస్కౌంట్లు ప్రకటించక ముందు ఎక్స్-షోరూమ్‌లో రూ. 6.60 లక్షల నుంచి రూ. 10.74 లక్షల మధ్య విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








