Tata కారుపై రూ.60000 వరకు డిస్కౌంట్‌.. ఆఫర్‌ ఎప్పటి వరకు ఉందంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ హ్యాచ్‌బ్యాక్‌ కారుపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. డిసెంబర్‌ 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌పై (Tata Tiago hatchback) రూ.60000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఇందులో క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్ రూపంలో ఈ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది.

టాటా టియాగో పెట్రోల్‌ వేరియంట్‌పైన రూ.40,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.15000, కార్పొరేట్‌ బోనస్‌ కింద రూ.5000 వరకు పొందవచ్చు. అదే CNG వేరియంట్‌పైన రూ.30000 క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.15000 మరియు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ కింద రూ.5000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Tata Tiago hatchback

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌పై సంస్థ ప్రకటించిన డిస్కౌంట్లు.. ప్రాంతం, రాష్ట్రం, డీలర్‌, రంగు, లభ్యత సహా ఇతర ఫీచర్లను బట్టి మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం టియాగో హ్యాచ్‌బ్యాక్‌ ధర రూ.5.60 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. మరియు ఈ కారు పెట్రోల్‌, CNG వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 85bhp శక్తి, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్ లేదా AMT తో జతచేయబడి ఉంటుంది. అదే CNG వేరియంట్‌తో ఈ కారు 72bhp శక్తి, 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Tata Tiago hatchback discount

టాటా మోటార్స్‌కు చెందిన అత్యంత సరసమైన మోడల్‌లలో టియాగో కారు ఒకటి. ఈ కారు 4 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ కారు చిన్న హ్యాచ్‌బ్యాక్‌ అయినా.. మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. CNG వేరియంట్‌లో 26.69km/kg మైలేజీని ఇస్తుంది. ఈ కారు 60 లీటర్ల ప్యూయల్‌ ట్యాంక్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు గరిష్ఠంగా 150 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు.

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మరియు సెంట్రల్‌ లాకింగ్‌తో వస్తుంది. ఎయిర్‌బ్యాగ్‌లు సహా సీట్‌ బెల్ట్‌ వార్నింగ్‌ సహా మరెన్నో భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు బిల్డ్‌ క్వాలిటీలో మెరుగైన వాహనంగా పేరుగాంచింది.

Tata year end offer 2023

ఇయర్ ఎండ్‌ నేపథ్యంలో తన ఉత్పత్తుల విక్రయాలను పెంచుకొనేందుకు వీలుగా అనేక సంస్థలు వివిధ రకాలైన ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు కూడా తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా టాటా సంస్థ టియాగో హ్యాచ్‌బ్యాక్‌పైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 31 వరకు ఉంటుందని టాటా తెలిపింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, December 18, 2023, 18:30 [IST]
English summary
Tata offers rs60000 discount tiago hatchback in december 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+