బైక్‌తో సరి సమానంగా మైలేజ్ ఇచ్చే టాటా పంచ్ CNG కారు బుకింగ్స్ ప్రారంభం!!
భారతీయ మార్కెట్‌లో అత్యంత నమ్మకమైన ఆటోమొబైల్ తయారీదారుగా టాటా మోటార్స్ ప్రజాదరణ పొందింది. వినియోగదారులకు అందుబాటు బడ్జెట్ ధరలో ఇప్పటికే టాటా నుంచి ఎన్నో రకాల మోడళ్లు విడుదలయ్యాయి. తాజాగా CNG సెగ్మెంట్‌లో డిమాండ్ ఉన్న ఒక కొత్త మోడల్‌ను టాటా పరిచయం చేయనుంది.
టాటా మోటార్స్ నుంచి త్వరలో పంచ్ మైక్రో SUVని విడుదల కానుంది. ఈ కారు బుకింగ్ గురించి ముఖ్యమైన సమాచారం, ఆసక్తికర విషయాలు ఈ కథనంలో మీరు చూడవచ్చు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లు CNGతో నడిచే పంచ్ SUV ప్రీ-ఆర్డర్‌లను తీసుకోవడం ప్రారంభించినట్లు సమాచారం. దీన్ని బట్టి పంచ్ కారు మరికొద్ది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

టాటా మోటార్స్ గత జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో (2023)లో ఆల్ట్రోజ్ CNG కారుతో పాటు పంచ్ CNG SUVని ప్రదర్శించింది. కొత్త టాటా పంచ్ సీఎన్‌జీ వెర్షన్ ఫీచర్లు, డిజైన్లు, ఇంజిన్ పనితీరు, ధర వివరాలను ఈ కథనంలో మీ కోసం అందిస్తున్నాం.
ఇక టాటా పంచ్ CNG డజన్ల కొద్దీ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇందులో ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.
టాటా పంచ్ CNG కారు ఇంజిన్‌ను పరిశీలిస్తే.. ఇది 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది CNG మోడ్‌లో గరిష్ఠంగా 76 bhp శక్తి వద్ద 97 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా టాటా పంచ్ సీఎన్‌జీలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది.
మైలేజీ విషయానికి వస్తే, ఇది 30 kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. ఈ కారు ట్విన్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. 30-లీటర్ల CNG ట్యాంక్ బానెట్ కింద ఉంటుంది. మీ లగేజీ కోసం విశాలమైన బూట్ స్పేస్ కలిగి ఉంది.
టాటా పంచ్ CNG కారు ప్రారంభ ధర దాదాపు రూ.10 లక్షలతో ప్రారంభమవుతుందని సమాచారం. అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. పంచ్ CNG SUV సిట్రస్ C3, మారుతి సుజుకి ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కిగర్‌లకు ప్రత్యక్ష పోటీదారుగా ఉంది. దానితో పాటు, రాబోయే హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీకి కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.
ప్రస్తుతం, భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా పంచ్ మైక్రో SUV ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.52 లక్షల ఎక్స్-షోరూమ్ ధర మధ్యలో ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 88 PS పవర్ వద్ద 115 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికల్లో లభిస్తుంది. లీటరుకు 18.8 - 20.09 కి.మీ మైలేజీని అందిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారులో దేశీయ కస్టమర్లను ఆకర్షించే అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. అధునాతనమైన ఫీచర్లు, డిజైన్, పనితీరు కలిగి ఉండటంతో అమ్మకాల పరంగా పంచ్ టాప్‌లో కొనసాగుతోంది.
ఇక భద్రత పరంగా, గ్లోబల్ NCAP నిర్వహించిన టెస్టుల్లో టాటా పంచ్ ది బెస్ట్‌గా ఉంది. మంచి రేటింగ్‌ను అందుకుంది. ఇది 17కి 16.45 స్కోర్‌తో వయోజన రక్షణ విభాగంలో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 49కి 40.89 స్కోర్ సంపాదించింది. 4 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ సహా అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








