Tata Punch EV టాటా పంచ్‌ ఎలక్ట్రిక్‌ కారు వచ్చేస్తోంది.. జనవరిలో లాంచ్‌ అయ్యే ఛాన్స్‌.!!

భారత మార్కెట్లో టాటా మోటార్స్‌ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్‌ కారు టాటా పంచ్(Tata Punch EV) ఈవీ. భారీ అంచనాలను కలిగి ఉన్న టాటా పంచ్‌ EV మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రానుంది. ఆవిష్కరణ, లాంచ్‌కి సంబంధించి ఆసక్తికర సమాచారం వెల్లడైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో టాటా మోటార్స్‌(Tata Motors) తన అంకితభావాన్ని ప్రదర్శిస్తోంది. ICE కార్ల నాణ్యమైన నిర్మాణంతో ఇప్పటికే కస్టమర్లలో మంచి పేరును సంపాదించుకున్న టాటా మోటార్స్‌.. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలోనూ అదే నాణ్యతను మెయింటెన్‌ చేస్తోంది. ఈ కారణంగా యాక్సిడెంట్లకు గురైన సందర్భాల్లోనూ ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతోంది.

Tata-Punch-EV

ఈ నేపథ్యంలో టాటా మోటార్స్.. ఈవీ భాగంలో తన తదుపరి ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం టాటా పంచ్‌ ఈవీ(Tata Punch.ev) వచ్చే ఏడాది 2024 జనవరి చివరి వారంలో భారత మార్కెట్లోకి అరంగేట్రం చేయనుంది. ఆవిష్కరణ అనంతరం మరికొద్ది రోజుల తర్వాత విడుదల కానున్నట్లు సమాచారం.

అయితే టాటా పంచ్ EV ఎప్పుడు లాంచ్‌ అవుతుందనే సమాచారాన్ని టాటా మోటార్స్‌ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఇదే సెగ్మెంట్‌లో వస్తున్న సిట్రోయెన్ eC3కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా టాటా పంచ్‌ ఈవీ నిలవనుంది. అంతే కాకుండా ఈ కారును టాటా మోటార్స్‌ అత్యంత సరసమైన ధరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Tata-Punch-EV

కాగా భారత మార్కెట్లో Citroen eC3 ధర వేరియంట్ల ప్రకారం రూ. 11.61 లక్షల నుంచి రూ. 12.79 లక్షల వరకు ఉంది. అయితే ప్రస్తుతం టాటా పంచ్‌ ఈవీకి సంబంధించి ఎలాంటి స్పెసిఫికేషన్స్‌ అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో ఈవీ, టిగోర్‌ ఈవీలో ఉపయోగించిన బ్యాటరీ స్పెసిఫికేషన్స్‌ కంటే కొంచెం ఎక్కువగా ఉండొచ్చు.

టాటా Tiago EV మరియు Tigor EVలో 24kWh యూనిట్‌ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. టాటా పంచ్‌ ఈవీలో ఇంతకంటే కొంచెం పెద్ద బ్యాటరీని ఉపయోగించవచ్చు. అంతే కాకుండా మరింత అడ్వాన్స్‌డ్‌గా ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీని కలిగి ఉండే అవకాశం ఉంది. దాదాపు 350 కి.మీ రేంజ్‌ను టాటా పంచ్‌ ఈవీలో ఆశించవచ్చని తెలుస్తోంది.

Tata-Punch-EV

పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్‌ టాటా పంచ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు మరికొన్ని ఫీచర్లను అదనంగా టాటా పంచ్‌ ఈవీలో పొందుపరచవచ్చు. ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, ఆల్‌- వీల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, Arcade.ev యాప్‌ సూట్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటు అదనంగా మరిన్ని ఫీచర్లను ఆశించవచ్చు.

అంతే కాకుండా కొత్త Nexon, Nexon EVలో కనిపించే విధంగా టాటా మోటార్స్ లోగోతో ప్రకాశవంతమైన స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కూడా టాటా పంచ్‌ ఈవీలో ఆశించవచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా టాటా పంచ్‌ ఈవీ స్పెసిఫికేషన్లు, డిజైన్‌, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాల కోసం మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే..

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 20, 2023, 12:27 [IST]
English summary
Tata punch ev unveil and launch details confirmed all you know here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+