Tata పంచ్ iCNG కారు విడుదల.. ప్రారంభ ధర రూ.7.10 లక్షలు..!
భారత్‌లో టాటా పంచ్ iCNG కారు విడుదల అయింది. తొలుత 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో పంచ్ iCNG కారును తొలుత టాటా సంస్థ ప్రదర్శించింది. ఇటీవల లాంచ్ చేసిన ఆల్ట్రోజ్ iCNG కారు తరహాలో నేచురల్ గ్యాస్ ఆధారిత పంచ్ మైక్రో ఎస్‌యూవీ ట్విన్ ట్యాంక్ CNG స్టోరేజీని కలిగి ఉంటుంది. అయినా ఎక్కువ బూట్ స్పేస్‌ను ఆక్రమించదు.
ఈ కారు ప్రారంభ ధర రూ.7.10 లక్షలు. పంచ్ iCNG కారు ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధర రూ.7.10 లక్షల నుంచి రూ.9.68 లక్షల వరకు ఉంది. టాటా పంచ్ iCNG వేరియంట్లు ప్యూర్ రూ.7.10 లక్షలు, అడ్వాంచర్ రూ.7.85 లక్షలు, అడ్వాంచర్ రిథమ్ రూ.8.20 లక్షలు, Accomplished రూ.8.85 లక్షలు, Accomplished Dazzle S ధర రూ.9.68 లక్షలుగా ఉంది. ఈ ధరలన్ని ఎక్స్‌షోరూంగా ఉండనున్నాయి.

ఆల్ట్రోజ్ iCNG తరహాలో టాటా పంచ్ iCNG కూడా CNG మోడ్‌లో కారును స్టార్ట్ చేయవచ్చు. ఆ కారులో ఉన్న ఆటోమేటిక్ స్విచ్ CNG నుంచి పెట్రోల్ మోడ్‌కు మారేందుకు అనుమతి ఇస్తుంది. పంచ్ iCNG కారు 1.2 నేచురల్ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
CNG మోడ్‌లో 72bhp శక్తి, 103Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే పెట్రోల్ మోడ్‌లో 84bhp శక్తి, 113Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా పంచ్ iCNG డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. మొత్తం కెపాసిటీ 60 లీటర్లు. అయితే ఇందుకోసం రెండు 30 లీటర్ల సిలిండర్లను వినియోగిస్తోంది. బూట్‌స్పేస్ ప్లోర్ కింద వీటిని అమర్చింది. దీంతో బూట్‌స్పేస్ కూడా అధికంగానే ఉంటుంది.

టాటా పంచ్ పెట్రోల్ వెర్షన్‌లతో పోలిస్తే పంచ్ iCNG మోడల్‌లో టెయిల్‌గేట్ వద్ద ICNG బ్యాడ్జిని మాత్రమే కలిగి ఉంటుంది. దాదాపుగా మిగిలిన స్పెసిఫికేషన్లు చాలా వరకు సమానంగానే ఉంటాయి. క్యాబిన్ కూడా చాలా వరకు ఒకే విధంగా ఉంటుంది. సన్‌రూఫ్ కలిగి ఉన్న తొలి iCNG మైక్రో ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది.
iCNG కారు చాలా భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ట్యాంక్‌ను హై క్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్ సహా తుప్పు పట్టకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. మరియు లీక్ డిటెక్షన్ ఫీచర్‌ను కలిగి ఉంది. థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఇది కారును ఆటోమేటిక్‌గా నిలిపేస్తుంది. ఈ ట్యాంక్ మూత తెరిచి ఉంటే కారు స్టార్ట్ కాకుండా చూసే మైక్రో స్విచ్ కూడా ఈ మైక్రో ఎస్‌యూవీ సొంతం.

సన్‌రూఫ్ కాకుండా టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ ప్రొజెక్టర్ ల్యాంప్, 16 అంగుళాల డైమెండ్ కట్ అల్లాయ్ వీల్స్, సర్దుబాటు చేసుకొనే వీలున్న డ్రైవర్ సీట్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ AC, ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్, ఆండ్రాయిడ్ కార్‌ప్లే, ఆపిల్ కార్‌ప్లేను సపోర్టు చేయగల 7.0 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.
దీంతోపాటు టియాగో ICNG హ్యాచ్‌బ్యాక్, టిగోర్ iCNG కంపాక్ట్ సెడాన్‌ల ట్విన్ సిలిండర్ వెర్షన్లను విడుదల చేసింది. డ్యూయల్ ట్యాంక్ టియాగో ICNG ప్రారంభ ధర రూ.6.55 లక్షలు కాగా, ట్విన్ సిలిండర్ టిగోర్ iCNG ధర రూ.7.8 లక్షలు (ఎక్స్‌షోరూం) వద్ద అందుబాటులో ఉంటుంది. ట్విన్ సిలిండర్ సెటప్ కారణంగా టియాగో, టిగోర్ అన్ని వేరియంట్ల CNG ధరలు రూ.5000 పెరిగాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








