Tata Punch CNG బైక్‌లతో సరిసమానంగా మైలేజ్ ఇవ్వనున్న టాటా పంచ్ సీఎన్‌జీ..!! ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా..?
దేశంలో ప్రస్తుతం కార్ల వినియోగా వేగంగా పెరుగుతోంది. అందులో భాగంగా చాలా కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే కార్లను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో చాలా వరకు అందుబాటు ధరల్లో కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కారు కొనేపట్టుప్పుడు మనలో చాలమంది మైలేజ్, ఫీచర్లపై ఎక్కువ ఉన్న వాటివైపే మొగ్గు చూపుతారు.
తక్కువ ధరలో అధిక నాణ్యత కలిగిన కార్లను ఉత్పత్తి చేయడంలో టాటా (టాటా మోటార్స్) భారతదేశంలో నమ్మకమైన వాహన తయారీదారుగా కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం హ్యుందాయ్ ఎక్స్ టర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ సంస్థ పంచ్ మైక్రో ఎస్‌యూవీని లాంఛ్ చేసింది. తాజాగా టాటా విడుదల చేసిన ఓ కారు మైలేజ్ వివరాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు మీకోసం..

స్కూటర్లు, బైకులతో పోలిస్తే సరిసమానంగా మైలేజ్ ఇచ్చే కారును టాటా పంచ్ చిన్న కారుని సంస్థ తీసుకువచ్చింది. ఈ విభాగంలో ఇదే బెస్ట్ కారు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు కిలోకు 26.9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని (ఎఆర్ఎఐ) నివేదిక తెలిపింది. దీనికి పోటీగా భావిస్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ (కిలోకు 27.1 కి.మీ) కూడా దాదాపుగా ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అయితే తక్కువ ధర ఎక్కువ ఫీచర్లు ఉండటంతో ఈ కారు రారాజుగా మారే అవకాశం లేకపోదు. మైలేజ్ పరంగా చూస్తే ద్విచక్ర వాహనాల కంటే ఇవి బాగా సరిపోతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఊహించిన ధరలో కలల కారుని సొంత చేసుకోవాలంటే ఇదే సరైన సమయం అని వారు సూచిస్తున్నారు.

సీఎన్‌జీ ఆధారిత టాటా పంచ్ ఎస్‌యూవీ 1.2-లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 74bhp వద్ద 95nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.10 లక్షలుగా ఉంది.
టాటా పంచ్ సీఎన్‌జీ ఎస్‌యూవీ యూత్ వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్ కలిగి ఉంది. ఇందులో 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్స్ డిస్ ప్లే, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ సిగ్నేచర్ గ్రిల్, రెండు వైపులా అత్యాధునిక హెడ్ లైట్లు ఉన్నాయి.

టాటా పంచ్ ఎస్‌యూవీలోని దాదాపు అన్ని పెట్రోల్ వేరియంట్లలో సన్ రూఫ్‌ని ప్రవేశపెట్టింది. వేరియంట్ల ధరలు రూ.8.25 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది కాకుండా పంచ్ కారు యొక్క వివిధ వేరియంట్లు ఎక్స్-షోరూముల్లో రూ .6 లక్షల నుండి రూ .10.10 లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. టాటా పంచ్ కూడా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల జాబితాలో చోటు దక్కించుకుంది.
పెట్రోల్ తో నడిచే టాటా పంచ్ ఎస్‌యూవీ ఇంజన్ పనితీరు విషయానికి వస్తే, ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది, ఇది 87 బిహెచ్ పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ / 5-స్పీడ్ ఎఎంటి గేర్ బాక్స్ ఆప్షన్ 18.8 - 20.09 కిలోమీటర్ల మైలేజీతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

టాటా పంచ్, మైక్రో ఎస్‌యూవీ అయినప్పటికీ, భద్రత పరంగా చూస్తే గ్లోబల్ NCAP రేటింగ్‌లో 5-స్టార్ సాధించింది. ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), రేర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టాటా మోటార్స్ ప్రారంభించిన రెండేళ్లలోనే 2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.
టాటా మరియు పంచ్ కూడా కొన్ని నెలల్లోనే ఎలక్ట్రిక్ విభాగంలో లాంఛ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది రూ .12 లక్షల ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పూర్తి ఛార్జ్ చేస్తే 350 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని అంచనా. ఇంధనంతో నడిచే కారు మాదిరిగానే, ఎలక్ట్రిక్ పంచ్ కూడా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఇక పంచ్ సీఎన్‌జీ ఎస్‌యూవీకి పోటీగా భావిస్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 95bhp వద్ద 68nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ లో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.5 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications








