ఆటో ఎక్స్‌పో 2023: CNG వెర్షన్‌లో విడుదల కావడానికి సిద్దమవుతున్న Tata Punch
దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పోలో ఆధునిక మోడల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి మరియు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో SUV 'టాటా పంచ్ iCNG' వెర్షన్ లో అడుగుపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి టాటా పంచ్ ప్రజాదరణ పొందడంలో విజయవంతం అయింది. అయితే ఈ మోడల్ ఇప్పుడు iCNG రూపంలో మార్కెట్లోకి రానుంది. ఇది కూడా సాధారణ మోడల్ కంటే కూడా ఉత్తమ అమ్మకాలను పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. టాటా పంచ్ iCNG చిన్న SUV అయినప్పటికీ మంచి బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో 30-లీటర్ల పరిమాణంలో రెండు చిన్న సిఎన్‌జి ట్యాంకులు అమర్చబడి ఉంటాయి.

టాటా పంచ్ లో మెరుగైన బూట్ స్పేస్ అందించడంలో భాగంగానే కంపెనీ ఇందులో రెండు చిన్న సిఎన్‌జి ట్యాంకులను అమర్చింది. అదే సమయంలో ఇందులో స్పేర్ వీల్ కారు కింద అమర్చబడి ఉంటుంది. ఇవన్నీ కూడా టాటా పంచ్ లో బూట్ స్పేస్ అందించాలనే సదుద్దేశంతోనే జరిగాయి. ఈ టాటా పంచ్ iCNG దాని సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. కావున ఇది తప్పకుండా దేశీయ మార్కెట్లో మరింత ఆదరణ పొందనుంది.
కొత్త టాటా పంచ్ iCNG మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో iCNG మాదిరిగానే పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. కావున ఇందులో 1.2 లీటర్, 3 సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ ఇంజిన్ టాటా టియాగో ఐసిఎన్‌జిలో 72 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ అందించింది. అయితే పెట్రోల్ వెర్షన్ లో ఇది 85 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

టాటా పంచ్ iCNG ఇతర టాటా CNG కార్ల మాదిరిగానే కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. ఇది ఒక కేజీ CNG కి 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని భావిస్తున్నాము. కావున ఇది స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ కంటే మంచి మైలేజ్ అందిస్తుంది. ఈ SUV త్వరలోనే భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త టాటా పంచ్ iCNG ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
సాధారణ టాటా పంచ్ లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కావున ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి.

దేశీయ మార్కెట్లో విక్రయించబడుతున్న టాటా పంచ్ SUV NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించి సురక్షితమైన వాహనంగా మారింది. ఈ టెస్ట్ లో వయోజన భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. అదేవిధంగా పిల్లల భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నట్లు తెలిసింది. కావున దేశీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్లలో టాటా పంచ్ ఒకటి.
టాటా పంచ్ మైక్రో SUV లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో రానున్న టాటా పంచ్ iCNG లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టాటా పంచ్ iCNG గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








