Tata Punch సరికొత్త రికార్డు.. కేవలం 19 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల ఉత్పత్తి.. ఇతర కార్లకు గట్టి పంచ్!!
మార్కెట్‌లోకి నెలలో కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. నయా ఫీచర్లతో, సరసమైన ధరలతో వీటిని తయారీ సంస్థలు రూపొందిస్తున్నాయి. ఇతర కంపెనీల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు ఆటో మొబైల్ కంపెనీలు పోటాపోటీగా కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్‌లోకి విడుదలైన ఓ కారు కొద్ది కాలంలోనే ఊహించని రీతిలో సేల్స్‌లో సత్తా చాటింది. కేవలం రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే ఈ కారు 2 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
రెండేళ్లలో రికార్డు స్థాయి అమ్మకాలు: 2021 అక్టోబర్‌లో టాటా మోటార్స్ రిలీజ్ చేసిన టాటా కొత్త కారు హవా సృష్టిస్తోంది. ఇప్పటి వరకు టాటా మోటార్స్ రిలీజ్ చేసిన కార్లలో కొన్ని కార్లు చాలా పాపులర్ అయ్యాయి. అలా పాపులర్ అయిన కార్లలో టాటా పంచ్ ఒకటి(Tata Punch). తాజాగా మహరాష్ట్రలోని ఈ కారు 2 లక్షల యూనిట్ కారును సంస్థ ప్రతినిధులు ప్రదర్శించారు.

కేవలం 19 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల తయారీతో టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. మార్కెట్‌లోకి టాటా పంచ్ రిలీజైన 10 నెలల్లోనే అంటే ఆగష్టు 2022 నాటికి లక్ష యూనిట్ల మైలు రాయిని చేరుకుంది. మరో ఐదు నెలల్లో మరో 50 వేల యూనిట్ల అమ్మకాలు చేసింది. ఈ నాలుగు నెలల్లో మరో 50 వేల కార్ల అమ్మకాలతో మొత్తంగా 2 లక్షల యూనిట్ల తయారీతో మొత్తం సేల్స్‌లో రికార్డు సృష్టించింది.
ఇంజన్ పనితీరు భేష్: కారు కొనాలనుకునే ప్రజలకు అందుబాటు ధరలో ఈ కారు ఉంది. మంచి ఇంజన్ సామర్థ్యం, ఆకర్షణీయమైన బాడీ స్టైలింగ్ ఇలా అనేక ఫీచర్లతో టాటా పంచ్ ఎస్‌యూవీ కస్టమర్లను భారీగా ఆకట్టుకుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. 82 bhp వద్ద 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది.
ఫీచర్లు: ఈ కారులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్(Push button start), ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 అంగుళాల టచ్ స్క్రీన్(seven inches toch screen), లెదర్ మెటీరియల్‌తో చుట్టిన స్టీరింగ్ వీల‌్ గేర్ నాబ్(leather covered steering wheel and gear knob) ఉంటాయి.
వీటితో పాటు కూల్ గ్లోవ్ బాక్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సెమీ డిజటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా ఇలా పలు రకాల సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
కలర్ల విషయానికి వస్తే ఈ పంచ్ టోర్నాడో బ్లూ, కాలిప్సో రెడ్, మీటియర్ బ్రాంజ్, అటామిక్ ఆరెంజ్, ట్రాపికల్ మిస్ట్, ఫోలేజ్ గ్రీన్, డేటోనా గ్రే, ఓర్కస్ వైట్ కలర్స్‌లో లభిస్తోంది. అదిరి పోయే లుక్ లో ఇవి వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. ఆన్ రోడులో ఈ కారుని సులభంగా గుర్తించవచ్చు.
టాటా పంచ్ ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్‌డ్, క్రియేటివిటీ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇక ఈ కారు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. టాటా పంచ్ కేవలం రూ.6 లక్షలకే(ఎక్స్ షోరూమ్) బేస్ వేరియంట్ లో లభించనుంది. ఇక ఈ వేరియంట్లలోని హైఎండ్ మోడల్ ధర రూ.9. 50 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) ఉంది.
ఇతర కంపెనీలకు చెందిన కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. మారుతి సుజుకి ఇగ్నిస్(Maruti Suzuki Ignis), నిస్సానా మాగ్నైట్(Nissana magnite), రెనాల్ట్ కైగర్(Renault kiger), సిట్రియాన్ సీ 3(Citroen C3), మారుతి సుజుకి ఫ్రాంక్స్(Maruti Suzuki Fronx) మోడల్ కార్లతో పాటు త్వరలో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్న హుందాయ్ ఎక్స్‌టర్(Hyundai Exter)కి టాటా పంచ్ గట్టి పోటీనిస్తోంది.


Click it and Unblock the Notifications








