అమ్మకాల్లో టాటా పంచ్ ప్రభంజనం: 15 నెలల్లో అరుదైన రికార్డ్.. ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి మంచి బుకింగ్స్ పొందుతూ అమ్మకాల పరంగా ముందుకు శరవేగంగా దూసుకెళ్తోంది. కంపెనీ గత 15 నెలల కాలంలో ఏకంగా 1,50,000 కంటే ఎక్కువ టాటా పంచ్ SUV లను విక్రయించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2021 లో భారతీయ మార్కెట్లో విడుదలైన టాటా పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ వాహనంగా నిలిచింది. (మొదటి స్థానంలో టాటా నెక్సాన్ ఉంది). మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి 2022 డిసెంబర్ వరకు కంపెనీ 1,52,466 యూనిట్లను విక్రయించగలిగింది. అంటే కంపెనీ ప్రతి నెలా కనీసం 10,164 యూనిట్ల పంచ్ SUV లను విక్రయించగలిగినట్లు అర్థమవుతోంది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప వృద్ధి అనే చెప్పాలి.

15 నెలల్లో టాటా పంచ్ అమ్మకాలు ఇలా ఉన్నాయి..

భారతదేశంలో కాంపాక్ట్ SUV లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగానే టాటా కార్లు విపరీతంగా అమ్ముడవవుతున్నాయి. టాటా పంచ్ 2022 జనవరిలో 10,027 యూనిట్లను విక్రయించింది. ప్రారంభంలో టాటా పంచ్ అమ్మకాలు అంత మెరుగ్గా లేకపోయినప్పటికీ, క్రమంగా అమ్మకాలు పెరిగాయి. ఆ తరువాత మార్చి 2022 నుంచి కనీసం 10,000 యూనిట్లకు తగ్గకుండా టాటా పంచ్ SUV విక్రయించబడింది. 2022 సెప్టెంబర్ నెలలో అత్యధికంగా 12,251 యూనిట్లు విక్రయించబడ్డాయి.

టాటా పంచ్ SUV లో 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. కావున పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగా దేశీయ మార్కెట్లో ఇది ఎక్కువగా విక్రయించబడుతోంది.

టాటా పంచ్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. టాటా పంచ్ యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు మరియు డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

టాటా పంచ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్‌ఎ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 27 కనెక్టెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. అంతే కాకుండా టాటా పంచ్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది.

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ తన టాటా పంచ్ SUV ని CNG వెర్షన్ లో తీసుకురానున్నట్లు ఇప్పటికే తెలిపింది, టాటా పంచ్ CNG వెర్షన్ 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడింది. ఇది టాటా టియాగో iCNG మాదిరిగానే పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. కావున ఇందులో 1.2 లీటర్, 3 సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఇది ఒక కేజీ CNG కి 25 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని భావిస్తున్నాము.

అంతే కాకుండా టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో విక్రయించబడే అవకాశం ఉంటుంది. టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు యొక్క రేంజ్ వంటివి కూడా ఇంకా అందుబాటులో లేదు, అయినప్పటికీ ఇది 300 నుంచి 350 కిమీ పరిధిని అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంపెనీ టాటా పంచ్ SUV ని ఈ రెండు వెర్షన్స్ లో తీసుకు వస్తే అమ్మకాలు మరింత పెరుగుతాయి.

Most Read Articles

English summary
Tata punch sold over 150000 units in 15 months details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X