Tata Punch: మరింత సేఫ్టీగా టాటా పంచ్.. ఆరు ఎయిర్‌బ్యాగులతో ఇక ప్రత్యర్థులకు గట్టి పోటీ.!!
ప్రముఖ దేశీయ బ్రాండ్ టాటా మోటార్స్‌కు చెందిన కార్లకు కస్టమర్లలో మంచి ఆదరణ ఉంది. బిల్ట్ క్వాలిటీ, మెరుగైన పనితీరుతో సేఫ్టీ విషయంలో ప్రయాణికులకు షూరిటీ ఇస్తోంది. కాగా టాటా పంచ్‌తో మైక్రో SUV విభాగంలోకి టాటా మోటార్స్ ప్రవేశించగా.. రెండేళ్లయినా ఈ కారుకు డిమాండ్ తగ్గలేదు. ఈ నేపథ్యంలో టాటా పంచ్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ మన ముందుకొస్తోంది.
గ్లోబల్ ఎన్‌క్యాప్ మాదిరిగానే దేశంలో భారత్ ఎన్‌క్యాప్(BHARAT NCAP) ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఇకపై భారత్‌లో తయారవుతున్న కార్లను క్రాష్ టెస్ట్ కోసం విదేశాలకు పంపిచాల్సిన అవసరం లేదు. స్వదేశంలోనే సేఫ్టీ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ సిస్టమ్ కింద క్రాష్ టెస్టింగ్‌కు గురైన మొదటి కార్లలో టాటా పంచ్(Tata Punch) ఒకటిగా ఉన్నట్లు సమాచారం.

భారత్ NCAP క్రాష్ టెస్ట్ నుంచి వెలువడిన చిత్రాలను పరిశీలించినట్లయితే టాటా పంచ్ SUV 6 ఎయిర్ బ్యాగులను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టాటా పంచ్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు కలిగి ఉండగా.. ఇప్పుడు సైడ్ ఎయిర్ బ్యాగులు, కర్టెన్ ఎయిర్ బ్యాగులతో కలిపి మొత్తంగా 6 ఎయిర్‌బ్యాగులతో వస్తోంది. కాగా టాటా పంచ్ పోటీదారు హ్యుందాయ్ Exter ఇప్పటికే ఆరు ఎయిర్‌బ్యాగులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
కాగా ఆరు ఎయిర్‌బ్యాగులను టాటా పంచ్ అన్ని వేరియంట్లలో అందిస్తుందా లేక టాప్ స్పెక్ వేరియంట్‌లో మాత్రమే అందిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంతే కాకుండా పంచ్ ఎస్‌యూవీకి 'Feel Good' ఫీచర్లను జోడించాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. వేరియంట్ల వారీగా టాటా పంచ్ ఎస్‌యూవీలో ఆకర్షణీయమైన ఫీచర్లు చూడవచ్చు.

అయితే టాటా పంచ్ ఎస్‌యూవీ గతంలో గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న భారత్ ఎన్‌క్యాప్‌లో ఇంతే స్టార్ రేటింగ్‌ను రిపీట్ చేస్తుందా లేదా వేచి చూడాలి. కాగా భారత మార్కెట్‌లో టాటా పంచ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 6 లక్షలుగా ఉంది. వేరియంట్‌ను బట్టి ధరలు మారుతుంటాయి.
టాటా పంచ్ ఎస్‌యూవీ ఇంజిన్ విషయానికొస్తే ఇందులో పెట్రోల్ వేరియంట్ 1.2-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 85 bhp శక్తిని మరియు 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో జత చేయబడి ఉంటాయి. మైలేజ్ పరంగా, వేరియంట్‌లను బట్టి 18.8 - 20.09 kmpl ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది.

టాటా పంచ్ CNG వెర్షన్‌ను పరిశీలిస్తే.. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే కొంచెం తక్కువ 74 bhp శక్తిని 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఇది 26.9 కిమీ/కిలో మైలేజ్‌ని ఇస్తుంది.
భద్రతా పరంగా టాటా పంచ్ కొనుగోలుదారులకు మంచి ఆప్షన్. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, తాజా అప్‌డేట్‌తో మొత్తంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ వ్యూ కెమెరా, ఫోర్-స్పోక్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, టర్న్ ఇండికేటర్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లను చూడవచ్చు.

ఇప్పటికే పలుమార్లు టాటా పంచ్ టెస్ట్ రన్ జరగ్గా.. త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా ఈ కారు విడుదల కానుంది. ఇది పెద్ద బ్యాటరీ మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. పూర్తి ఛార్జింగ్‌పై 350 కి.మీ రేంజ్‌తో.. రూ.12 లక్షల ధరలో త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications








