టాటా సఫారీ కార్లకు భారీ డిమాండ్.. డెలివరీకి ఎన్ని వారాలు పడుతుందో తెలుసా?
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని కార్ల కోసం వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ జాబితాలో టాటా సఫారి SUV కారు కూడా ఉంది. టాటా మోటార్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా టాటా సఫారి 2023.. ఫిబ్రవరిలో విడుదల అయింది. ఈ కారు ధర 15.65 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది.
టాటా సఫారీ 2023 కారుకు ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగింది. ఫలితంగా వెయిటింగ్ పీరియడ్ ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు పెరిగింది. ప్రస్తుతం ఈ సమయం ముంబయి కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. డీలర్, వేరియంట్, రంగు, వెర్షన్ సహా ఇతర అంశాలను బట్టి వెయిటింగ్ పీరియడ్ మారవచ్చు. మీ ప్రాంతంలో టాటా సఫారీ ఎస్‌యూవీ వెయిటింగ్ పీరియడ్ గురించి తెలుసుకొనేందుకు స్థానిక డీలర్‌ను సంప్రదించండి.

భారత్‌లో BS6 నిబంధనలకు అనుగుణంగా సఫారీ SUVను టాటా సంస్థ ఇటీవల అప్‌గ్రేడ్ చేసింది. భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తు ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సహా మరిన్ని కీలక ఫీచర్లతో టాటా సఫారీ SUV ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది.
టాటా సఫారీ SUV 2023 కారు 2.0 లీటర్ డిజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 168bhp శక్తి, 350Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా సఫారీ కారు ఇంజిన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తుంది.

టాటా సఫారీలో అనేక ఫీచర్లు ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఇల్యూమినేటెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా సఫారి కారు ఇంజిన్, ఫీచర్ల పరంగా అత్యుత్తమమైనది. మరియ భద్రతపరంగా ADAS ఫీచర్‌ను కలిగి ఉంది. మరియు భారత్ మార్కెట్‌లో టాటా సఫారి.. మహీంద్రా XUV700కు గట్టిపోటీ ఇస్తోంది.

* ఇటీవలే టాటా ఆల్ట్రోజ్ కారు కొత్త వేరియంట్లు విడుదల అయ్యాయి. ఆల్ట్రోజ్ లైనప్‌ను బలోపేతం చేసేందుకు XM, XM(S) వేరియంట్లను టాటా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు ప్రధానంగా యువతను ఆకర్షిస్తాయని టాటా మోటార్స్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
టాటా ఆల్ట్రోజ్ XM వేరియంట్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ORVM, R16 పుల్ వీల్ కవర్ సహా ప్రీమియం లుకింగ్ డ్యాష్‌బోర్డును కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లకు అదనంగా XM(S) వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. 9 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
ఆల్ట్రోజ్ XM, XM(S) వేరియంట్లు రెండు కూడా 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. 6000rpm వద్ద 88.2bhp శక్తి, 3300rpm వద్ద 115Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. మరియు 5- స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. టాటా ఆల్ట్రోజ్ XM వేరియంట్ ధర రూ.6.90 లక్షలు, XM(S) వేరియంట్ రూ.7.35 లక్షల (ఎక్స్‌షోరూం) ధరను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








