Tata Safari Facelift అధిక మైలేజీతో కొత్త టాటా సఫారీ కారు.. త్వరలో విడుదల..!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఆదరణ కలిగి ఉంది. ఈ సంస్థ ఇటీవల హారియర్, సఫారీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను (Tata Safari Facelift) లాంచ్ చేసింది. వీటి బుకింగ్‌లను ప్రారంభించింది. రూ.25000 అడ్వాన్స్ చెల్లించి ఈ కార్లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని టాటా మోటార్స్ సంస్థ తెలిపింది. వీటి ధరలపై ఇంకా స్పష్టత లేదు.
ఈ ఫేస్‌లిఫ్టెడ్ టాటా సఫారీ ధరను దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త సఫారీ కారు మైలేజీ వివరాలు వెల్లడయ్యాయి. పాత మోడల్ సఫారీ కంటే... ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ మైలేజీ ఎక్కువ ఉందని సమాచారం.

టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ (New Tata safari) ముందుతరం మోడల్ మాదిరిగానే 2.0 లీటర్, 4 సిలిండర్ క్రయోటెల్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 168bhp గరిష్ఠ శక్తి, 350Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. శక్తిని ఫ్రంట్ వీల్స్‌కు పంపుతుంది.
టాటా సఫారీ కొత్త వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 16.30 kmpl మైలేజీని అందిస్తుంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 14.50 kmpl మైలేజీని అందించనుంది. పాత మోడల్ టాటా సఫారీ వాహనం 16.14 kmpl, 14.08 kmpl మైలేజీని అందిస్తోంది.

అయితే ఫేస్‌లిఫ్టెడ్ టాటా సఫారీ కారు.. పాత మోడల్‌తో పోలిస్తే డిజైన్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. కొత్త గ్రిల్, స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, LED DRL, రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్, వెనుకవైపు లైట్‌బార్ ఉంటుంది. ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటాయి.
కొత్త టాటా సఫారీ కారు 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 6 ఎయిర్‌బ్యాగ్, లెవల్-2 ADAS ( అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కొత్త టాటా సఫారీ వాహనం 7 రంగులు, 10 వేరియంట్లలో లభించనుంది. ఈ కారు ధరను దసరా సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే రూ.16 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ పండుగ సీజన్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








