డీలర్‌షిప్‌కు చేరుకున్న టాటా సఫారీ కొత్త వేరియంట్.. ఇందులోని ఫీచర్లు చూశారా.??
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్లో టాటా మోటార్స్ అప్‌డేటెడ్ టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్(Tata Safari Facelift) ఎస్‌యూవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటీరియర్, ఎక్స్‌టీరయర్ ఇంజిన్ పరంగా ఇందులో సంస్థ చాలా మార్పులు చేసింది. ఈ క్రమంలో టాటా సఫారీలోని కొత్త వేరియంట్ తాజాగా డీలర్‌షిప్‌లకు చేరుకుంది.
టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ను టాటా మోటార్స్ రూ. 16.19 లక్షల(ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కాగా తాజాగా అప్‌డేటెడ్ Safari యొక్క మూడు-వరుసల స్మార్ట్ (O) వేరియంట్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటోంది. కొత్త టాటా సఫారీని ఫేస్‌లిఫ్ట్ ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అడ్వెంచర్ ప్లస్ డార్క్, అకాంప్లిష్డ్ ఇలా అధునాతన ఫీచర్లతో ఆకర్షణీయమైన వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

షోరూమ్‌లకు చేరుకున్న టాటా సఫారీ Smart (O) వేరియంట్ రూ.16.69 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లును అమర్చారు. టిల్ట్ & టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ & కో ప్యాసింజర్ సీట్, 4 డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లతో అప్‌డేట్ చేశారు.
ఇంకా కొత్త టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్ (O) వేరియంట్‌లో సెంట్రల్ లాకింగ్, పవర్ విండో, కనెక్ట్ చేయబడిన LED DRL మరియు టెయిల్‌లైట్ ఉన్నాయి. ఇంకా TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMలు, మూడవ వరుసలో AC వెంట్‌లు, బాస్ మోడ్‌ను కలిగి ఉంది. కానీ ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకపోవడం ఆశ్చర్యకరం.

ఇక ఇంజిన్ విషయానికొస్తే సఫారి ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్ (O) వేరియంట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది 1.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. 170 PS పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంకా 16.30 kmpl మైలేజ్‌ని అందిస్తుంది.
కొత్త టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌తో పాటుగా అప్‌డేటెడ్ హారియర్ ఫేస్‌లిఫ్ట్ SUV కూడా భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర రూ. 15.49 లక్షల నుండి రూ. 24.49 (ఎక్స్ షోరూమ్)లక్షల ధరతో టాటా మోటార్స్ ప్రవేశపెట్టింది. కలర్స్ విషయానికొస్తే టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్.. లూనార్ వైట్, పెబుల్ గ్రే, సన్‌లైట్ ఎల్లో మరియు కోరల్ రెడ్‌తో సహా 6 ఆకర్షణీయమైన కలర్స్ ఆప్షన్లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.

అప్‌డేటెడ్ టాటా హారియర్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అమర్చారు. ఇది డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10-స్పీకర్ JBL-ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇక సేఫ్టీ పరంగా 5-స్టార్ రేటింగ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా డజన్ల కొద్దీ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

అప్‌డేటెడ్ టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్(Tata Harrier Facelift) 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 170 hp గరిష్ట శక్తిని 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో వేరియంట్‌ను బట్టి 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








