తక్కువ ధరలో 'డార్క్ ఎడిషన్' టాటా కార్లు..!!

టాటా హారియర్, సఫారీ డార్క్ ఎడిషన్ లను కంపెనీ త్వరలోనే అందుబాటులోకి తేనుంది. దీనికి సంబంధించిన తాజా టీజర్ ని సంస్థ విడుదల చేసింది. అతి త్వరలోనే ఈ సరికొత్త ఎడిషన్ భారతీయ మార్కెట్ లో విడుదల కానుంది. రెండు డార్క్ ఎడిషన్స్ డార్క్ రెడ్, రెడ్ డార్క్ ఎడిషన్స్ లో కంపెనీ వీటిని తీసుకురానుంది.

హారియర్, సఫారీ డార్క్ ఎడిషన్స్ ని ఆటో ఎక్స్ పో 2023 లో సంస్థ ప్రదర్శించింది. నాటి నుంచి ఈ డార్క్ ఎడిషన్స్ కోసం కార్ల ప్రియులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే ఈ సరికొత్త డార్క్ ఎడిషన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు SUV ఎడిషన్ లోని నెక్సాన్ కాంపాక్ట్ మోడల్ ని డార్క్ రెడ్ ఎడిషన్ లో తీసుకువస్తున్నట్లు ప్రకటించి యాజమాన్యం ఆశ్చర్యానికి గురిచేసింది.

టాటా మోటార్స్

బుకింగ్స్ ప్రారంభం..

హారియర్, సఫారీలకు సంబంధించిన బుకింగ్స్ ని సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. రెడ్ డార్క్ ఎడిషన్ లో ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌ లు రెడ్ యాక్సెంట్‌ లతో రానున్నట్లు కంపెనీ విడుదల చేసింది. క్యాబిన్ లోపల రెడ్ థీమ్ అనుభూతిని పంచేలా దీనిని అలంకరించారు. పై రూఫ్ చుట్టూ లైటింగ్ ను అమర్చి సరికొత్త ఫీచర్లతో ఈ డార్క్ ఎడిషన్‌ లను మరింత ఆధునీకరించారు.

టాటా తన సఫారీ, హారియర్ మోడళ్లలో అడాస్ లెవల్-2 టక్నాలజీని అమలు చేసింది. టాటా సఫారీ-2023, టాటా హ్యారియర్-2023 మోడళ్లలో ఈ అడాస్ టెక్నాలజీని పొందవచ్చు. సరికొత్త 10.2 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్, 7 అంగుళాల ఆల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. 360 డిగ్రీ కెమెరాలు, వైర్ లెస్ చార్జింగ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లతో ఈ కారును రూపొందించారు.

అడాస్ టెక్నాలజీతో అందుబాటులోకి..

ప్రస్తుతం కార్ల కంపెనీలు విడుదల చేస్తున్న SUVవాహనాల్లో దాదాపు అన్నీ సంస్థలు అడాస్ ఫీచర్ ని తప్పనిసరిగా తీసుకువస్తున్నాయి. అడాస్ (ADAS) . అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ గా దీన్ని పిలుస్తారు. అడాస్ మోడ్ లో చాలావరకు డ్రైవింగ్ బాధ్యతల్నీ కారులోని ఎలక్ట్రానిక్ వ్యవస్థే చూసుకుంటుంది. ఇందుకోసం ప్రత్యేక టెక్నాలజీని ఆయా కంపెనీలు SUV కార్లలో పొందుపరచాయి.

ఈ ఫీచర్ ద్వారా అత్యవసరమైనప్పుడు ఆటోమేటిక్ గా బ్రేకులు పడతాయి. అలానే స్టీరింగ్ కూడా అవసరానికి అనుగుణంగా తనంతట తానే తిరుగుతుంది. కారుకు ఎదురుగా ఎవరైనా అడ్డం వస్తే కారు వెంటనే ఆగిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ న ఈ కారు గుర్తిస్తుంది. లేన్ మారాల్సి వచ్చినప్పుడు అలెర్ట్ చేయడమే కాకుండా.. పొరపాటున డ్రైవర్ నిద్రపోతే వెంటనే అలర్ట్ చేసేలా అడాస్ టెక్నాలజీ పనిచేస్తుంది. పార్కింగ్ ని కూడా డ్రైవర్ ప్రమేయం ఈ టెక్నాలజీ చేసి పెడుతుంది.

టాటా డార్క్ ఎడిషన్

అడాస్ లెవల్ 2 వాహనాలు..

అనేక సెన్సర్లు, కెమెరాలతో సమన్వయం చేసుకుంటూ ఈ అడాస్ టెక్నాలజీ పనిచేస్తుంది. భారత్ లో కొన్ని వాహనాల్లో ప్రస్తుతం అడాస్ లెవల్-2 టెక్నాలజీ పొందుపరిచారు. ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్ యూవీ 700, టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి మోడళ్లలో అడాస్ ఫీచర్ చూడొచ్చు. దీనివల్ల ప్రమాదాలను నివారించడమే కాకుండా అన్నీ విధాలా ప్యాసింజర్స్ అలర్ట్ గా ఉండేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక టాటా టియాగో, పంచ్, నెక్సన్, హారియర్, సఫారీ ప్యాసింజర్ వాహనాలల్లో బీఎస్ 6 స్టేజ్ 2 నిబంధనల ప్రకారం SUV ఇంజన్ లను సంస్థ తీసుకువస్తుంది. అయితే కొత్తగా విడుదల కానున్న రెడ్ డార్క్ ఎడిషన్‌ లు సంబంధిత స్టాండర్డ్ వేరియంట్‌ ల కంటే దాదాపు రూ. 30,000 నుండి రూ. 1 లక్ష వరకు ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, February 20, 2023, 9:46 [IST]
English summary
Tata safari harrier red dark editions teaser released
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+