టాటా టియాగో EV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ యొక్క 'టియాగో ఈవి' (Tiago EV) బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అయితే కంపెనీ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

టాటా టియాగో EV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

టాటా టియాగో ఈవి బుకింగ్స్ ప్రారంభించిన మూడు నెలల తరువాత టెస్ట్ డ్రైవ్స్ ప్రారభించింది. అయితే డెలివరీలు ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రూ.21,000 చెల్లింపుతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే కంపెనీ మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది. టియాగో ఈవీ ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్).

టాటా టియాగో EV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

కొత్త టాటా టియాగో ఈవి మంచి డిజైన్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లను కలిగి, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, గ్రిల్‌పై ఉన్న ట్రై-యారో మోటిఫ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో టీల్-బ్లూ కలర్ తో ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 14 ఇంచెస్ స్టీల్ వీల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త కారుకి కొత్త లుక్ అందిస్తాయి.

టాటా టియాగో EV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

టాటా టియాగో ఈవి 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది, ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

టాటా టియాగో EV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) లో Ziptron హై-వోల్టేజ్ ఆర్కిటెక్చర్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి IP67 రేటింగ్‌ కలిగి ఉంది. టియాగో ఈవి కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త టియాగో ఈవి సిటీ మరియు స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్‌లు మరియు 4 రీజెన్ మోడ్‌లను కలిగి ఉంది.

టాటా టియాగో EV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

కొత్త టాటా టియాగో ఈవి 19.2kWh మరియు 24kWh అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని మరియు 24kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుంది. టియాగో ఈవి 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

టాటా టియాగో EV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఇతర టాటా మోటార్స్ వాహనాల మాదిరిగానే కొత్త 'టియాగో ఈవి' (Tiago EV) కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది, కావున ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్‌ మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. కావున ఇవన్నీ టాటా టియాగో ఈవి వినియోగదారులకు పటిష్టమైన భద్రత కల్పించడంలో సహాయపడతాయి.

టాటా టియాగో EV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

టాటా టియాగో ఈవి మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్. ఇవన్నీ కూడా అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా మరింత బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నాము, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 4, 2023, 9:44 [IST]
English summary
Tata tiago ev test drive begins details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+