Tesla త్వరలోనే భారత్‌కు టెస్లా.. కారు ప్రారంభ ధర ఎంతో తెలుసా.!
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) తమ హవాను ప్రదర్శిస్తూ డిమాండ్‌ను ఏర్పరుచుకున్నాయి. దీన్ని మంచి అవకాశంగా మలుచుకుని దేశీయ, విదేశీ ప్రముఖ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికాకు చెందిన టెస్లా కూడా ఈ వరుసలో చేరబోతోంది.
ఈ క్రమంలో టెస్లా ఏటా 500,000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో దేశంలో అతిపెద్ద ఫ్యాక్టరీని స్థాపించడానికి పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి కంపెనీ సీనియర్ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించినట్లు వివిధ మీడియా సంస్థలు గురువారం వెల్లడించాయి.

టెస్లా భారత్‌లో రూ.20 లక్షల ధరతో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త టెస్లా అధినేత ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా.. భారతదేశంలో కార్లను తయారు చేసి జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి ఇండో-పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోందని వర్గాలు తెలిపాయి.
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా బాస్ ఎలాన్ మస్క్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అక్కడ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై చర్చలు జరిపారు. దీనిపై మాట్లాడిన ఎలాన్ మస్క్.. 'నేను వచ్చే ఏడాది భారత్‌కు వెళ్తాను. త్వరలో టెస్లా అక్కడ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.' అని వెల్లడించిన సంగతి తెలిసిందే.

భారత్‌కు రానున్నట్టు తెలుస్తున్న టెస్లా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రాష్ట్రాలను ఆహ్వానించడం ప్రారంభించింది. ఈ జాబితాలో కర్ణాటక కూడా ఉంది. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్ ట్వీట్ చేశారు. 'భారత్‌లో టెస్లా కంపెనీని ప్రారంభించడానికి కర్నాటక బెస్ట్ ప్లేస్ అని రాష్ట్రంలో వ్యాపార స్థాపనకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన వెల్లడించారు.
కొన్నేళ్ల క్రితం (జనవరి 2021), టెస్లా యొక్క అనుబంధ సంస్థ 'టెస్లా ఇండియా మోటార్స్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్' బెంగళూరులో రిజిస్టర్ చేయబడింది. దీన్ని బట్టి చూస్తే, భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న టెస్లాకు బెంగళూరు అత్యుత్తమ వ్యాపార ప్రదేశంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఇప్పటికే, బెంగళూరు EV హబ్‌గా మారుతోంది. ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు ఓలా, ఈథర్ మరియు సింపుల్ ఎనర్జీ ఇక్కడి నుంచే పనిచేస్తున్నాయి. ఒక అధ్యయన నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలపై అత్యధిక పరిశోధనలు బెంగళూరులోనే జరుగుతున్నాయి. దీంతో టెస్సా పెట్టుబడులకు బెంగుళూరు ఒక మంచి ఛాయిస్‌గా ఎంచుకోవడంలో సందేహం లేదు.
ప్రస్తుతం టెస్లా భారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. టెస్లా పెట్టుబడులతో దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. టెస్లా కంపెనీని ఆకట్టుకునేందుకు ప్రతి రాష్ట్రం ప్రయత్నిస్తోంది. ఈ జాబితాలో హైదరాబాద్ కూడా ఉంటుందని ఆశిద్దాం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








