2 మిలియన్ కార్లను రీకాల్ చేసిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ.. తీవ్ర భద్రతా లోపమా?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. తన ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని భద్రతా లోపాలను గుర్తించింది. దీంతో భారీగా వాహనాలను రీకాల్ చేసింది. 2023 సంవత్సరంలోనే పెద్ద రీకాల్‌గా పిలుస్తోంది. అయితే రీకాల్ గల కారణాలు, ఎన్ని వాహనాలను టెస్లా రీకాల్ చేస్తోంది వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత కార్ల తయారీగా పేరుగాంచిన టెస్లా సుమారు 2 మిలియన్ కార్లను తక్షణమే రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. టెస్లా కార్ల సెక్యూరిటీ ఫీచర్ అయిన ఆటో పైలెట్ వ్యవస్థలో లోపాన్ని గుర్తించి, ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.

అయితే టెస్లా తీసుకున్న రీకాల్ నిర్ణయం అమెరికాలో మాత్రమే వర్తిస్తుందని తెలుస్తోంది. అయితే కొందరు భారతీయులు కూడా ఈ కార్లను దిగుమతి చేసుకొని వినియోగిస్తున్నారు. దీంతో ఈ రీకాల్ వారికి కూడా వర్తిస్తుందా లేదా అని తెలియరాలేదు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.
2015లో టెస్లా తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. టెస్లా ఆటో పైలెట్ (సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్) టెక్నాలజీ ఆటోమొబైల్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పుగా పరిగణించవచ్చు. ఈ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా లేన్‌లను మార్చడానికి మరియు ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేయడం, వేగాన్ని నియంత్రించడానికి అనుమతిస్తుంది. అయితే ఈ ఫీచర్‌లోనే లోపం తలెత్తినట్లు టెస్లా గుర్తించినట్లు తెలుస్తోంది.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆటోమోటివ్ సేఫ్టీ రెగ్యూలేటర్స్ ఈ ఆటోపైలెట్ వ్యవస్థను గుర్తించాలని టెస్లా సంస్థను కోరింది. దీంతో 2 మిలియన్ కార్లకు రీకాల్ చేస్తోంది. టెస్లా సంస్థ ఆటోపైలెట్ వ్యవస్థను గత 8 సంవత్సరాల్లో అనేక సార్లు అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం అత్యుత్తమ స్థాయికి చేర్చింది.
ఆటో స్టీరింగ్ సాయంతో రోడ్లపైనున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా క్రూయిజ్ కంట్రోల్‌ని నిర్వహించేలా పక్కా ఏర్పాట్లు చేసింది. దీంతో డ్రైవర్ సాయం లేకుండా వాహనాలు అత్యంత సురక్షితంగా ప్రయాణం చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఈ ఫీచర్‌లో లోపం కారణంగా గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. దీంతో టెస్లా కార్ల భద్రత పట్ల అనేక ప్రశ్నలు తలెత్తాయి.
అయితే ప్రస్తుతం టెస్లా తీసుకున్న రీకాల్ నిర్ణయం మోడల్ Y, మోడల్ S మరియు మోడల్ 3, X వర్తిస్తుంది. ఈ రీకాల్ అక్టోబర్ 5, 2012 నుంచి డిసెంబర్ 7, 2023 మధ్య తయారు చేయబడిన అన్ని కార్లకు వర్తిస్తుందని టెస్లా వెల్లడించింది. ఈ కార్లలో ఏదైనా లోపాన్ని గుర్తిస్తే మరమ్మతు చేయడం మరియు కొత్త వాటితో భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఉచితంగా సర్వీస్ చేస్తారని తెలుస్తోంది.
అయితే మరి కొద్దినెలల్లో భారత్‌లోకి టెస్లా అడుగుపెట్టనుందని వార్తలు వస్తున్నాయి. అన్ని సక్రమంగా జరిగితే టెస్లా మోడల్ 3 లేదా మోడల్ Y.. భారత్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇదివరకే టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. దీనిపై అంతర్గతంగా చర్చలు జరగుతున్నట్లు తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








