Top 5 Car Brands Google: ఈ సంవత్సరం ఎక్కువగా సెర్చ్ చేసిన కార్లు ఇవే!! టాప్‌లో ఆ కంపెనీ కార్లు..

స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూస్తున్నాం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌పై ఆధారపడుతున్నాం. గూగుల్‌లో మనకు దొరకని జవాబంటూ ఉండదు. ఏదైనా వస్తువు కొనాలంటే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు గూగుల్‌ ఓపెన్‌ చేయాల్సిందే.. ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరంలో చాలా మంది కార్ల గురించి కూడా వెతికారు.

భారత్‌లో ఇప్పుడు కారు నిత్యావసరంగా మారిపోయింది. అందుకే కారు కొనేముందు ఏ బ్రాండ్‌ కారు బాగుంటుంది.. ధర ఎంత.. ఫీచర్లేంటి తదితర వివరాల కోసం గూగుల్‌ చేస్తాం. ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ ఇలా చాలా మంది కొత్త కారు సమాచారం కోసం గూగుల్‌లో వెతికేవారే. అలా ఈ ఏడాది 2023లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 5 కార్‌ బ్రాండ్ల జాబితాను చూద్దామా..

Top-Searched-Car-Brands

టయోటా(Toyota Motors): ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న కార్ల తయారీ సంస్థ టయోటా. ఈ జపనీస్ కార్ బ్రాండ్‌పై 64 దేశాల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించారు. అందువల్ల, టయోటా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా కోరిన కార్ల తయారీదారుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

Toyota-Land-Cruiser

టయోటా మోటార్స్‌ 2020లో కూడా మొదటి స్థానంలోనే ఉంది. టాప్‌ సెర్చ్‌ జాబితాలోనే కాదు కార్ల విక్రయాల్లో కూడా ఈ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. నాణ్యత, ఆకట్టుకునే డిజైన్‌, ఆకర్షణీయమైన ఫీచర్లు.. ఈ సంస్థ యొక్క కార్లు ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం.

టెస్లా(Tesla): అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లాను.. ప్రపంచంలోని 29 కంటే ఎక్కువ దేశాలలో ప్రజలు ఎక్కువగా శోధించారు. అందువల్ల టెస్లా రెండో స్థానంలో నిలిచింది. మోడల్ 3 మరియు మోడల్ Y ఈ కార్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులు. వీటికోసమే ఈ కార్ బ్రాండ్ కోసం చాలా మంది గూగుల్‌ చేస్తున్నారు.

Tesla-Cybertruck

అంతే కాకుండా టెస్లా బ్రాండ్ యొక్క సైబర్ ట్రక్ కోసం చాలా మంది గూగుల్‌లో వెతికారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. బీఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి ప్రముఖ విదేశీ బ్రాండ్‌లకు సవాల్‌ విసురుతోంది. అంతే కాకుండా టెస్లా ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది.

బీఎండబ్ల్యూ(BMW): 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించిన కార్ బ్రాండ్‌ల జాబితాలో BMW మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఇది జర్మన్ కార్ల తయారీ కంపెనీ. మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి సహా ఇతర ప్రముఖ బ్రాండ్‌లకు బీఎండబ్ల్యూ ప్రధాన పోటీదారుగా అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్లోనూ ఉంది.

BMW-5-Series

26 కంటే ఎక్కువ దేశాల్లోని ప్రజలు ఈ కార్ బ్రాండ్‌ గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు. ఫలితంగా BMW మూడో స్థానంలో ఉంది. గతేడాది బీఎండబ్ల్యూ బ్రాండ్ రెండవ స్థానంలో ఉండగా.. ఈ సారి ఆ స్థానాన్ని టెస్లా కైవసం చేసుకోవడం గమనించదగ్గ విషయం.

Audi

ఆడి(Audi): ప్రముఖ కార్‌ బ్రాండ్ ఆడి గురించి 7 దేశాల ప్రజలు ఎక్కువగా ఈ ఏడాది గూగుల్‌లో వెతికారు. ఈ కారణంగా గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆడి నాలుగవ స్థానంలో నిలిచింది. కానీ 2022లో, ఈ కార్ బ్రాండ్ 9 దేశాల్లో అత్యధికంగా శోధించిన బ్రాండ్‌లలో మొదటి స్థానంలో నిలిచింది.

మెర్సిడెస్ బెంజ్(Mercedes Benz): గతేడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన కార్ బ్రాండ్‌ల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన మెర్సిడెస్‌ బెంజ్‌.. ఈ ఏడాది ఐదో స్థానానికి పడిపోయింది. కేవలం ఆరు దేశాల ప్రజలు మాత్రమే ఈ కారు కోసం గూగుల్‌ చేశారు. 2022లో 10కి పైగా దేశాలు ఈ కారు కోసం గూగుల్‌లో వెతికారు.

Mercedes-EQG

కారు కొనేముందు చాలా మంది కారు మోడల్ కోసం మాత్రమే కాకుండా కార్ బ్రాండ్ గురించి తెలుసుకోవడానికి గూగుల్‌పై ఆధారపడుతున్నారు. తాము కొనాలనుకున్న బ్రాండ్‌ గురించి ఎక్కువగా పరిశోధన చేస్తున్నారు. దీన్ని బట్టి ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది.

More from DriveSpark

Article Published On: Friday, December 22, 2023, 16:52 [IST]
English summary
These are the top most searched car brands on google 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+