Upcoming Cars పొట్టి కారు నుంచి గట్టి కార్ల వరకు ఈ నెల ఆఖర్లో మూడు డిఫరెంట్ కార్లు విడుదల..
భారత్ లో గత మూడు నెలలుగా ఆటోమోటివ్ పరిశ్రమ అనేర ఆవిష్కరణలు, సరికొత్త లాంఛ్ లతో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు సరికొత్త SUVలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కథనంలో, ఏప్రిల్ 2023 ఆఖరు వారంలో రానున్న మూడు కొత్త కార్లపై ఓ లుక్కేద్దాం.
MG మోటార్ ఇండియా నుంచి ఇటీవలే కామెట్ EVని ఆ సంస్థ ఆవిష్కరించింది. ఇప్పటికే ఆ కంపెనీ నుంచి భారత మార్కెట్లో ZS EV కారు అందుబాటులో ఉంది. తాజాగా సరికొత్త ఈ పొట్టికారును కామెట్ EV సంస్థ లాంఛ్ చేయనుంది. దీంతో ఈ కారుపై భారీ అంచనాలు పెరిగాయి. కారు ప్రకటన నుంచి మొదలు నేటి వరకు అనేక సందర్భాల్లో ఈ పొట్టికారు వార్తల్లో నిలిచింది.

గుజరాత్ లోని కంపెనీ మాన్ ఫాక్చర్ యూనిట్ లో వీటిని సంస్థ తయారు చేస్తుంది. కామెట్ EV SAIC (షాంఘై ఆటోమేటిక్ ఇండస్ట్రీ కార్పరేషన్) జనరల్ మోటార్స్ వులింగ్ మధ్య జాయింట్ వెంచర్‌లో అభివృద్ధి చేయబడిన GSEV (గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రానుంది. ఈ కారు దేశంలోనే పొట్టికారుగా నిలువనుంది.
కొలతల పరంగా, MG కామెట్ EV పొడవు 2,974 mm, వెడల్పు 1,505 mm, 1,640 mm ఎత్తును కలిగి ఉంది. కేవలం 2,010 మిమీ వీల్ బేస్ తో ఈ కారుని సంస్థ తీసుకువస్తుంది. MG కామెట్ మూడు-డోర్ల సెటప్‌ను కలిగి ఉంది. ఇది LED DRLలు, LED హెడ్‌లైట్లు, LED టర్న్ సిగ్నల్స్‌తో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను చూడవచ్చు. EV విండ్‌స్క్రీన్‌కి కింద LED లైట్ బార్‌కి EV వెడల్పు అంతటా క్రోమ్ స్ట్రిప్‌తో వ్యాపించి ఉండనుంది.
ఈ కామెట్ EV డ్యూయల్-టోన్ థీమ్‌లో అందుబాటులో ఉండనుంది. ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ట్విన్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లు ఉండనున్నాయి. కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రివర్స్ కెమెరా, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.
MG కామెట్ EV 5 కలర్లలో అందుబాటులో ఉండనుంది. ఇది 17.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కి.మీ పరిధి రేంజ్ ని అందించనుంది. కామెట్ EV 41 bhp వద్ద 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుని ఛార్జ్ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. 3.3 kW AC ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ధర దాదాపు రూ.10 లక్షలుగా ఉండనుంది.

2. మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఢిల్లీలో 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీతో పాటు ఫ్రాంక్స్‌ను మారుతి సుజుకి ఆవిష్కరించింది. ఏప్రిల్ చివర్లో ఈ కాంపాక్ట్ SUVని సంస్థ మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ కారు సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
హెడ్‌లైట్‌లతో కూడిన స్ప్లిట్ గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉన్న మారుతి సుజుకి ఫ్రాంక్స్.. కనెక్ట్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్‌తో ప్రత్యేకమైన టెయిల్‌గేట్ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది.
1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ 100 bhp వద్ద 143 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలానే 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే కారు 90 bhp వద్ద 113 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక ఈ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి. DRL, ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్‌తో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో కారు రానుంది. వీటితో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో,క్రూయిజ్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ IRVM, HUD డిస్‌ప్లే, ఫీచర్లు ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్-హోల్డ్ అసిస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ESPవంటి మరిన్నీ ఫీచర్లున్నాయి.

3. సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్: ఈ కారుని ఇండియన్ మార్కెట్ లో ఏప్రిల్ 27న తీసుకువస్తున్నట్లు సిట్రోయెన్ ఇండియా ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి ప్రస్తుతం C5 ఎయిర్‌క్రాస్, C3, ëC3 వంటి కార్లు ఉన్నాయి. ఫ్రెంచ్ కార్‌మేకర్ నుంచి వస్తున్న నాల్గవ ఉత్పత్తిగా C3 ఎయిర్‌క్రాస్ నిలువనుంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్‌లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
C3 ఎయిర్‌క్రాస్ C3 హ్యాచ్‌బ్యాక్‌కు ఆధారమైన CMP మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. C3 ఎయిర్‌క్రాస్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, రీ-డిజైన్ చేయబడిన గ్రిల్, ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉండనుంది. SUV పెద్ద వెనుక డోర్ B, C పిల్లర్ల మధ్య కొత్త గ్లాస్ ఏరియాతో వస్తుంది. ఈ కారు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా పొందుతుంది.
ఇంజన్ మరియు గేర్‌బాక్స్ గురించి మాట్లాడితే, C3 ఎయిర్‌క్రాస్ పెట్రోల్-ఓన్లీ పవర్‌ట్రెయిన్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌తో ఇది 110 bhp వద్ద 190 NM టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. అలానే ఇది 1.2-లీటర్, 3-సిలిండర్, NA పెట్రోల్ ఇంజన్‌తో కూడా రానుంది. ఈ ఇంజన్ 82 bhp వద్ద 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
ఇక టర్బో పెట్రోల్ ఇంజన్ లో 6-స్పీడ్ మాన్యువల్, NA ఇంజన్ లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్, Apple CarPlay/Android ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాషర్‌లతో కూడిన రియర్ డి-ఫాగర్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. కొత్తగా రూపొందించిన స్టీరింగ్ వీల్‌ను పొందవచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








