తక్కువ ధరలో సన్‌రూఫ్‌ ఫీచర్‌ ఉన్న టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే..

భారత ఆటోమొబైల్‌ రంగంలో వాహన తయారీదారులు అధునాతన ఫీచర్లు, డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అందులో సన్‌రూఫ్‌ ఒకటి. గతంలో లగ్జరీ కార్లకే పరిమితమైన సన్‌రూఫ్‌ ఫీచర్‌ ఇప్పుడు బడ్జెట్‌ కార్లలో సైతం తయారీదారులు ప్రవేశపెడుతున్నారు. సరసమైన ధరలో అందుబాటులో ఉన్న టాప్ 10 ఎస్‌యూవీల జాబితాను ఈ కథనంలో మీ కోసం అందిస్తున్నాం.

హ్యుందాయ్ క్రెటా: ఈ జాబితాలో అత్యంత సరసమైన SUV, హ్యుందాయ్ క్రెటా. మిడ్-స్పెక్ S+ నైట్ ఎడిషన్ ట్రిమ్ నుంచి పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 115 hp వద్ద 144 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్, డీజిల్‌ ఇంజిన్‌తో 116 hp వద్ద 250 Nm, గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Panoramic-Sunroof-Feature

రెండూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండటంతో పాటు, పెట్రోల్ CVTతో జతచేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజిన్‌ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ చాలా మంది కస్టమర్‌లను క్రెటా వైపు ఆకర్షిస్తోంది. ధర రూ. 13.96 లక్షల నుంచి 19.20 లక్షల మధ్య ఉంది.

MG ఆస్టర్‌: MG ఆస్టర్‌ మిడ్-స్పెక్ స్మార్ట్ ట్రిమ్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుంది. ఆస్టర్ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. 110hp వద్ద 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా CVTతో జత చేయబడింది. ఎరుపు రంగు ఇంటీరియర్‌తో పాటు, పనోరమిక్ సన్‌రూఫ్ క్యాబిన్ యొక్క ప్రీమియం లుక్‌ను పెంచుతుంది. ధర రూ.14.21 లక్షలు- రూ. 18.69 లక్షలు.

Panoramic-Sunroof-Feature

కియా సెల్టోస్: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్టెడ్ ఎస్‌యూవీ.. ఇది HTK+ ట్రిమ్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఇది కేవలం టర్బో-పెట్రోల్ ఇంజిన్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. అయినప్పటికీ, HTX నుంచి, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్ సెల్టోస్‌లో స్పేస్ సెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ వేరియంట్‌లో 115hp వద్ద 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్, డీజిల్‌ ఇంజన్‌తో, 116hp వద్ద 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, ఒక CVT, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఉన్నాయి. ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా: మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో మిడ్‌ సైజ్‌ SUV సెగ్మెంట్‌లోకి ప్రవేశించింన తర్వాత.. పనోరమిక్ సన్‌రూఫ్‌ను మొదటిసారిగా ఉపయోగించింది. ఇది ఆల్ఫా పెట్రోల్ ట్రిమ్ మరియు స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. భారీ సన్‌రూఫ్ క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ధర రూ. 15.41 లక్షల నుంచి రూ. 19.83 లక్షల మధ్య ఉంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: గ్రాండ్ విటారా మాదిరిగానే, టయోటా హైరైడర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన టాప్-స్పెక్ V ట్రిమ్‌లో, స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ G మరియు V ట్రిమ్‌లలో సన్‌రూఫ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. హైరైడర్‌ నలుపు, గోధుమ రంగుతో లోపలి భాగం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్ దాని ప్రీమియం లుక్‌ను మరింత ఆకర్షణీయం చేస్తుంది. ధర రూ. 16.04 లక్షలు - రూ. 19.99 లక్షలు.

హ్యుందాయ్ అల్కాజర్‌: హ్యుందాయ్‌ ఆల్కాజర్(Alcazar) అధునాతన పనోరమిక్‌ సన్‌రూఫ్‌ ఫీచర్‌తో వస్తుంది. 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. 160hp వద్ద 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 116hp వద్ద 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర రూ. 16.78 లక్షలు - 21.13 లక్షలు.

MG హెక్టర్: ఆస్టర్ మాదిరిగానే, హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్‌లు మిడ్-స్పెక్ స్మార్ట్ ట్రిమ్ నుంచి పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉన్నాయి. సన్‌రూఫ్ క్యాబిన్ ప్రయాణికులకు మంచి అనుభూతిని ఇస్తుంది. రెండు SUVలు 143hp వద్ద 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 170hp వద్ద 350Nm గరిష్ఠ టార్క్‌ ఉత్పత్తితో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికతో అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా XUV 700: మహీంద్రా బ్రాండ్‌ నుంచి XUV 700 కొత్త 'ట్విన్ పీక్స్' లోగోను కలిగి ఉన్న మొదటి ఎస్‌యూవీ. ADASని ఫీచర్‌ను కలిగి ఉండటంతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉన్న మొదటి ఎస్‌యూవీ ఇదే. XUV700 AX5 మరియు AX7 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది.

XUV 700 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 200hp వద్ద 380Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో శక్తితో 185hp వద్ద 420Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ధర రూ. 17.82 లక్షల నుంచి రూ. 26.18 లక్షల మధ్య ఉంది.

టాటా హారియర్‌: టాటా ఉత్పత్తుల్లో టాటా హారియర్‌ పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉన్న మొదటి ఎస్‌యూవీ. ఇది క్యాబిన్ యొక్క ప్రీమియం లుక్‌ను మరింత పెంచుతుంది. ఇది XM(S) ట్రిమ్‌లో పెద్ద సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో 170hp వద్ద 350Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా సఫారి: హారియర్ మాదిరిగానే, సఫారి కూడా XM(S) ట్రిమ్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ ఫీచర్‌తో వస్తుంది. సఫారి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో 170hp వద్ద 350Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర రూ. 18.66 లక్షల నుంచి రూ. 25.22 లక్షల మధ్య ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 24, 2023, 17:07 [IST]
English summary
Top 10 most affordable suvs with panoramic sunroof feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+