Top SUVs రూ.10 లక్షల లోపు లభించే టాప్-4 ఎస్‌యూవీ కార్లు
ఈ రోజుల్లో చాలా మంది ఫ్యామిలీతోనో లేదంటే ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లాలన్నా.. ఇంకా ఆఫీసు అవసరాలకైనా ఎక్కువగా సొంత వాహనాల్లోనే వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిలోనే అత్యంత సౌకర్యవంతంగా ఫీలవుతారు. అందుకే దేశీయ మార్కెట్లో కార్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇక్కడ మీకు బడ్జెట్ ధరలో లభించే టాప్ 4 కార్ల గురించి అందిస్తున్నాం.
కారు కొనేముందు ముఖ్యంగా మైలేజ్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సౌకర్యం, దృఢమైన పనితీరు, విశాలమైన ఇంటీరియర్స్ ఇంకా లగేజ్ భద్రపరుచుకోవడానికి పెద్ద బూట్ స్పేస్ ఉండే కారును సెలెక్ట్ చేసుకుంటారు. ఈ క్రమంలో మీరు మంచి కారును కొనాలని ప్లాన్ చేసుకుంటే.. ఇక్కడ మీరు రూ. 10 లక్షల లోపు ధరలో లభించే టాప్(Top 4 Cars) ఎస్‌యూవీల గురించి తెలుసుకోవచ్చు.

మారుతి సుజుకి బ్రెజా: కస్టమర్లలో అత్యంత ఆదరణ పొందిన బ్రాండ్ మారుతి కార్లు. 2022లో తిరిగి అందుబాటులోకి వచ్చిన మారుతి సుజుకి బ్రెజ్జా(Maruti Suzuki Brezza) కస్టమర్ల ఫేవరెట్ మోడల్స్‌లో మొదటి స్థానంలో ఉంది. 5 సీట్ కాన్ఫిగరేషన్‌లో ఈ SUV LXi, VXi, ZXi మరియు ZXi+ అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది.
LXi, LXi CNG మరియు VXi వేరియంట్‌లను రూ. 10 లక్ష లోపు కొనుగోలు చేయవచ్చు. బ్రెజ్జా 103 bhp పవర్ వద్ద 138 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 1.5-లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇంకా 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ యూనిట్లను కలిగి ఉంటాయి.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్: ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న కారు కొత్తగా ప్రారంభించబడిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్(Tata Nexon facelift). ఈ తాజా SUV నాలుగు వేరియంట్‌లలో రెండు పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో స్మార్ట్(Smart), ప్యూర్(Pure), క్రియేటివ్(Creative), ఫియర్‌లెస్(Fearless) వేరియంట్లు Plus (+)' ప్రిఫిక్స్ ప్యాక్‌తో ఉంటాయి.
అయితే సన్‌రూఫ్ కలిగి ఉన్న వేరియంట్లు 'S' ప్రిఫిక్స్‌తో ఉంటాయని గుర్తుంచుకోవాలి. స్మార్ట్(Smart), స్మార్ట్ ప్లస్(SmartPlus), సన్‌రూఫ్‌తో కూడిన స్మార్ట్ ప్లస్(SmartPlus With Sunroof), 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ప్యూర్(Pure) వేరియంట్ ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Kia Sonet: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమేకర్ కియా.. దాని ఎంట్రీ-లెవల్ SUV సోనెట్()ను బడ్జెట్ ధరలో ప్రవేశపెట్టింది. దీని ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 10 లక్షలుగా ఉంది. ముఖ్యంగా, ఇక్కడ కస్టమర్‌లు iMT గేర్‌బాక్స్ ఎంపికతో ఎంట్రీ-లెవల్ డీజిల్ వేరియంట్ HTEని కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ బడ్జెట్‌లోనే పెట్రోల్ వేరియంట్‌లో HTE, HTK మరియు HTK ప్లస్ వేరియంట్‌లను కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
హ్యుందాయ్ వెన్యూ: జాబితాలో చివరిది Hyundai Venue. E, S, S (O), S Plus, SX, మరియు SX(O) వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ 5- సీట్ కాన్ఫిగరేషన్ హ్యుందాయ్ వెన్యూ SUVని పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన E, S, S(O), S(O) నైట్ ఎడిషన్‌లను మాత్రమే రూ. 10 లక్షల లోపు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం మరి.. మీ బడ్జెట్ ధరలో మీకు నచ్చిన కారును హ్యాపీగా కొనుగోలు చేయండి.



Click it and Unblock the Notifications








