Electric Cars తక్కువ ధరలో అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కార్లు.. హై రేంజ్‌, అదిరిపోయే ఫీచర్లతో..

వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో నిత్యం సరికొత్త ఫీచర్లు, రేంజ్‌తో వాహనదారులను ఆటోమొబైల్‌ కంపెనీలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పలు మోడళ్లు అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వాటా క్రమంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ ప్రస్తుతం అత్యధిక ఆఫర్లతో ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. దేశీయ మార్కెట్‌లో కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి కార్ల తయారీదారులు పోటీ పడుతున్నాయి. ఈ కోవలో టాటా మోటార్స్ మొత్తం మూడు EVలతో ఈ విభాగంలో టాప్‌లో ఉంది.

Electric Cars

ఎలక్ట్రిక్‌ వాహనాలలో అధిక ధరల శ్రేణిలో అనేక ఆఫర్లు ఉన్నప్పటికీ, సరసమైన ధరలతో ఉన్న ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ. 15 లక్షల్లో అందుబాటులో ఉన్న టాప్‌ 5 ఎలక్ట్రిక్‌ కార్ల జాబితా, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

సరసమైన ధరలో మార్కెట్‌లోకి విడుదలైన కారు ఎంజీ కామెట్‌ ఈవీ(MG COMET EV). MG కామెట్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 42 bhp వద్ద 110 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్‌షో రూమ్‌లో దీని ధర 7.98 లక్షల నుంచి రూ. 9.98 లక్షల వరకూ పలుకుతోంది.

MG Comet EV

టాటా మోటార్స్ నుంచి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, టియాగో EV. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో లభిస్తుంది. 19.2 kWh బ్యాటరీ 250 కిలోమీటర్ల రేంజ్‌, 24 kWh బ్యాటరీ 315 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. 74 bhp వద్ద 114 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్‌షో రూమ్‌లో టియాగో ఈవీ ధర రూ. 8.69 లక్షల నుంచి రూ. 11.99 లక్షలు పలుకుతోంది.

సిట్రియోన్‌ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో eC3ని విడుదల చేసింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 29.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 57 bhp వద్ద 143 Nm గరిష్ఠ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 320 కిలోమీటర్లు రేంజ్‌ను ఇస్తుంది. ఎక్స్‌షో రూమ్‌ ధర రూ. 11.50 లక్షల నుంచి రూ. 12.43 లక్షల వరకూ ఉంది.

Citroen ec3

టాటా నుంచి మరో ఈవీ టాటా టిగోర్‌. గత ఏడాది నవంబర్‌లో, టిగోర్ EVని 315 కిలోమీటర్ల రేంజ్‌కు పెంచింది. పవర్‌ట్రెయిన్ సెటప్ మారలేదు. 26 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. 75 bhp వద్ద 170 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్‌షో రూమ్‌లో దీని ధర రూ. 12.49 లక్షలు నుంచి రూ. 13.75 లక్షలుగా ఉంది.

Nexon EV మ్యాక్స్‌ను ప్రారంభించిన తర్వాత, టాటా మోటార్స్ సాధారణ మోడల్‌ను నెక్సాన్ EV ప్రైమ్‌గా భారత మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టింది. పవర్‌ట్రెయిన్ సరిగ్గా అదే విధంగా ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ SUV మల్టీ-మోడ్ రీజన్, క్రూయిజ్ కంట్రోల్ మరియు iTPMS వంటి కొన్ని కొత్త ఫీచర్లను ఇందులో ప్రవేశపెట్టింది.

Tata Nexon EV Prime

నెక్సాన్‌ ఈవీ ప్రైమ్‌ 127 bhp వద్ద 245 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 30.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే టాటా నెక్సాన్ EV ప్రైమ్ 312 కిలోమీటర్లు రేంజ్‌ను ఇస్తుంది. ఈ కారు ధర ఎక్స్‌షో రూమ్‌లో రూ. 14.49 లక్షల నుంచి రూ. 17.19 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, May 26, 2023, 18:38 [IST]
English summary
Top 5 electric cars list under rs 15 lakh in india details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+