జూన్‌లో అధికంగా అమ్ముడైన టాప్ 5 మారుతి సుజుకి కార్లు..!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి తన సత్తా చాటింది. జూన్ 2023లో ఏకంగా 1.33 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. గత సంవత్సరం కంటే సుమారు 8.4 శాతం అధికంగా విక్రయాలు జరిపింది. జూన్ నెలలో మారుతి సుజుకికి చెందిన అత్యధికంగా అమ్ముడుపోయిన ఐదు కార్లు వివరాలు మీకోసం.
మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (17481 యూనిట్లు): భారత్ మార్కెట్‌లో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ కార్ల విక్రయాల్లో స్థిరమైన వృద్ధిని కొనసాగించింది. జూన్ 2023 నెలలో 17,481 యానిట్లు హ్యాచ్‌బ్యాక్‌ల విక్రయాలు జరిగాయి. YoY విక్రయాలతో పోలిస్తే 8.9 శాతానికి మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ అమ్మకాలు తగ్గాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ (15955 యూనిట్లు) : 2023 జూన్ నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్ 15,955 యానిట్లను విక్రయించింది. మొత్తం మారుతి విక్రయాల్లో రెండో స్థానాన్ని పొందింది. YoY అమ్మకాల గణాంకాలు గతం కంటే తగ్గాయి. అయితే ఈ తగ్గుదల కేవలం 1.59 శాతానికి మాత్రమే పరిమితం అయింది. అంటే సుమారు 258 యూనిట్ల తేడా మాత్రమే ఉంది.
మారుతి సుజుకి బాలెనో (14,077 యూనిట్లు) : మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్ కార్లు ఈ జాన్ నెలలో 14,077 యూనిట్లు విక్రయాలు జరిగాయి. అయితే YoY విక్రయాల గణాంకాలతో పోల్చితే గణనీయమైన తగ్గుదల నమోదైంది. అంటే సుమారుగా 12.5 శాతం బాలెనో కార్ల అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది.

మారుతి సుజుకి ఆల్టో (11,323 యూనిట్లు) : జూన్ నెల అమ్మకాల్లో మారుతి సుజుకి ఆల్టో కార్లు గణనీయమైన వృద్ధి నమోదు చేశాయి. గత గణాంకాలతో పోలిస్తే సుమారు 18 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఇండో- జపానీస్ వాహన తయారీ సంస్థ జూన్ 2023 ఏకంగా 11,323 వాహనాలను విక్రయించగలిగింది.
మారుతి సుజుకి బ్రెజా (10,578 యూనిట్లు) : జూన్ నెల విక్రయాల్లో మారుతి సుజుకి బ్రెజా SUV అధికంగా అమ్ముడైన వాహనాల్లో 5 స్థానంలో నిలిచింది. జూన్ నెలలో ఈ సంస్థ 10,578 బ్రెజా కార్లను విక్రయించింది. YoY గణాంకాల ప్రకారం మారుతి సుజుకి బ్రెజా 140 శాతం వృద్ది నమోదు అయింది.

జున్ నెలలో మారుతి సుజుకి సంస్థ మొత్తం 1,33,027 యూనిట్లను విక్రయించింది. అందులో పైన పేర్కొన్న వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్, బాలెనో, ఆల్టో, బ్రెజా వాహనాల సంఖ్య 69,414గా ఉంది. ఈ సంఖ్య మొత్తం వాహనాల విక్రయాల సంఖ్యలో సుమారు 52 శాతంగా నమోదు అయింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్‌మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








