CNG కార్లు కొనాలని ఉందా.. తక్కువ ధరలో ఇవి చాలా బెటర్.. ఎందుకో తెలుసా..?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లను ప్రభుత్వం దశల వారీగా తొలగించే విధానాలు ముందుకు వస్తోంది. దీంతో CNG కార్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం సరైన మౌలిక సదుపాయాలు మద్దతుగా లేనందున CNG విభాగం ఇప్పటి బలంగా కొనసాగుతోంది.
మౌలిక సదుపాయాలు, తక్కువ ఉద్గారాలతో తయారయ్యే CNG టెక్నాలజీ.. దేశంలో 15 సంవత్సరాలుగా విజయవంతంగా దూసుకుపోతోంది. మరిన్నీ సంవత్సరాలు ఇలానే CNG అభివృద్ధి చెందనుంది. కొత్త ఎంట్రీ లెవల్ CNG కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. మీ కోసం భారతదేశంలో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న టాప్ 5 అత్యంత సరసమైన CNG కార్ల జాబితా మీకోసం..

మారుతి ఆల్టో 800..
భారత్ లో ఎంట్రీ లెవల్ CNG విభాగంలో మారుతీ సుజుకి తొలి స్థానంలో కొనసాగుతోంది. ఆ కంపెనీ నుంచి మారుతి సుజుకి ఆల్టో 800 LXI Opt S-CNG దేశంలో లభిస్తున్న అత్యంత సరసమైన CNG కారుగా నిలిచింది. ఇది ఒక కిలో ఇంధనానికి 31.59 కిమీ మైలేజీని అందిస్తుంది. ఇది 40.36 bhp వద్ద 60 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
800సీసీ ఇంజన్‌తో ఈ కారు పనిచేస్తుంది. ఆల్టో రెండు దశాబ్దాలకు పైగా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రియమైన కారుగా గుర్తింపు పొందింది. అనేక సందర్భాల్లో భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఇంకా ఈ కారు కొనసాగుతోంది. మార్కెట్ లో ధీని ధర 5.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మారుతి S-Presso..
ఇదే జాబితాలో రెండో స్థానంలో ఉన్న మారుతికి చెందిన మరో కారు S-Presso LXI CNG. ఇది కిలో ఇంధనానికి 32.73 కి.మీ మైలేజీని అందిస్తుంది. బాక్సీ ఏరోడైనమిక్స్‌తో 1.0 L K-సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 55.92 bhp వద్ద 82.1 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఆల్టో K10..
మారుతి సుజుకి గత సంవత్సరం ఆల్టో కె10ని భారత మార్కెట్లోకి తీసుకురాలేదు. దీంతో కొంత నిరాశ చెందినా తిరిగి మళ్లీ మార్కెట్ లోకి తీసుకురావడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్టో K10 మోటారును ఈ కారు కలిగి ఉంది. ఇది 55.92 bhp వద్ద 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా సాధారణ ఆల్టోతో పోలిస్తే బరువు నిష్పత్తికి మెరుగైన శక్తి లభిస్తుందని చెప్పవచ్చు. ఆల్టో K10 CNG 33.85 కిమీ/కిలో ఇంధనాన్ని అందిస్తుంది.

వ్యాగన్ R..
మారుతీ సుజుకి వ్యాగన్ R భారతదేశ ఆటోమోటివ్ చరిత్రలో అత్యంత ప్రియమైన కార్లలో ఒకటిగా ఉంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా కూడా అనేకసార్లు ఈ కారు అవార్డు పొందింది. వ్యాగన్ R యొక్క ప్రస్తుత వెర్షన్ మారుతి సుజుకి నుంచి 1.0 L K-సిరీస్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 55.92 bhp వద్ద 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ CNGలో 34.05 km/kg ఇంధనాన్ని అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.43 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.

టాటా టియాగో..
CNG అవతార్‌లో టాటా తమ ఉత్పత్తులను పరిచయం చేయడం ద్వారా మార్కెట్‌లో దూసుకుపోతోంది. టాటా టియాగో డీజిల్ వెర్షన్‌ను నిలిపివేసిన తర్వాత CNG వెర్షన్ ను తీసుకువచ్చింది. టియాగో CNG 1.2 L ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 72 bhp వద్ద 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 26.49 km/kg ఇంధనాన్ని అందిస్తుంది. టాటా మోటార్స్ నుంచి ప్రారంభ స్థాయి CNG కారు టియాగో XE CNG ధర రూ.6.44 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








