టాప్ 5 SUV కార్లు.. వీటిలో వెళ్తుంటే ఆ మజాయే వేరు..!

భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో SUV సెగ్మెంట్ చాలా సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉంది. మారుతి, హ్యుందాయ్, టాటా వంటి ప్రముఖ తయారీదారుల నుంచి వచ్చిన SUVలు ఇక్కడ ముందంజలో ఉన్నాయి. ఫిబ్రవరి 2023లో SUV సెగ్మెంట్ స్థిరమైన వృద్ధిని సాధించింది. గత నెలలో భారతదేశంలో విక్రయించబడిన మొదటి ఐదు సబ్-ఫోర్ SUVలు మీకోసం.

బ్రెజా..

ఫిబ్రవరిలో 15,787 యూనిట్లతో మొత్తం విక్రయాల్లో మారుతి సుజుకి నుంచి బ్రెజా SUV మొదటి స్థానంలో నిలిచింది. ఈ బ్రాండ్ గత సంవత్సరంలో ఇదే నెలలో 9,256 యూనిట్లను అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 71 శాతం వృద్ధి సాధించింది అన్నమాట. ఫిబ్రవరి 2022కి సంబంధించిన విక్రయాల డేటా ఆధారంగా ప్రీ-ఫేస్‌ లిఫ్టెడ్ విటారా బ్రెజాకి కొనుగోళ్లతో సమానం అని చెప్పవచ్చు.

మారుతి సుజుకి బ్రెజా

నెక్సాన్..

టాటా నెక్సాన్ భారతీయ వాహనదారులు అతిగా ఇష్టపడే మరొక కారు. ఫిబ్రవరిలో ఇది బెస్ట్ సెల్లర్‌లలో ఒకటిగా నిలిచింది. జనవరి 2023తో సహా అనేక నెలల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVల జాబితాలో అగ్రస్థానాన్ని పొందింది. అయితే తాజాగా ఫిబ్రవరి 2023లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయ్యింది. ఇదే నెలలో కేవలం 13,914 యూనిట్లను విక్రయించింది.

టాటా పంచ్..

అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఈ నెలలో తనదైన ముద్ర వేసిన మరో టాటా మోడల్ కారు పంచ్. ఇది అక్టోబర్ 2021లో భారతదేశంలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి టాటాకు ఈ కారు మంచి లాభాలు తెచ్చి పెడుతోంది. ప్రతి నెల అమ్మకాల్లో మంచి తీరు కనబరుస్తోంది. ఈ టాటా కారు ఫిబ్రవరి 2023లో 11,169 యూనిట్ల పంచ్‌లను విక్రయించింది. తద్వారా మూడవ స్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ జూన్ 2022లో ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. అప్పటి నుండి, ఫీచర్-ప్యాక్డ్ SUV కొనసాగుతోంది. క్రెటా తర్వాత అత్యంత అమితంగా ప్రేమించే కారుగా ఆ కంపెనీ నుంచి గుర్తింపు పొందింది. అలానే అమ్మకాల పరంగా ఈ కారు వేగంగా దూసుకుపోతుంది. ఈ కొరియన్ కార్ల తయారీ సంస్థ గత నెలలో 9997 యూనిట్ల వెన్యూలను విక్రయించగలిగింది. తద్వారా నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

కియా సొనెట్

కియా సోనెట్..

మొదటి ఐదు బెస్ట్ SUV విక్రయాల జాబితాలోకి ప్రవేశించిన మరొక కొరియన్ కారు 'కియా సోనెట్'. ఫిబ్రవరి 2023లో కియా 9,836 యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ వెన్యూ కారుకు ఇది గట్టి పోటీనిచ్చింది. దేశంలో కియా కార్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. ఈ సంస్థ భారతీయ మార్కెట్ లో వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాల్లో మారుతి సుజుకి కార్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఆ కంపెనీ నుంచి ఏకంగా 7 కార్లు మొత్తం సేల్స్ లో టాప్ లో నిలిచాయి. మారుతి సుజుకి కార్లు ఎప్పటి లాగే టాప్ లోకి వచ్చాయి. తర్వాతి స్థానాన్ని టాటా మోటార్స్ ఆక్రమించింది. ఫిబ్రవరిలో సేల్స్ గణనీయంగా పెరిగాయి.

మార్చిలో సరికొత్త కార్లు మన ముందుకు రాబోతున్నాయి. కొత్త సెడాన్లు, SUV మోడళ్లలోని ముఖ్యమైన కార్లు ఈ మార్చి నెలలోనే విడుదల కానున్నాయి. వాటిలో చాలా వరకు BS6 ఫేజ్ 2 నార్స్మ్ తో కూడిన అప్‌డేట్స్ లో వస్తున్నాయి. వీటిలో రెండు కొత్త కార్లు రూ.20 లక్షల కంటే తక్కువ సెగ్మెంట్‌ లో అందుబాటులో ఉండనున్నాయి.

బాలెనో.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కొత్త తరం బాలెనో కారు. ఇది ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ కొనుగోలుదారులలో బలమైన ఫేవరెట్‌గా నిలిచింది. గత సంవత్సరం విడుదల చేసిన కొత్త తరం బాలెనో గత కొన్ని నెలల్లో అమ్మకాల్లో భారీ పెరుగుదలను సాధించింది. ఫిబ్రవరిలో, మారుతీ బాలెనో 18592 యూనిట్లను సేల్ చేసింది.


More from DriveSpark

Article Published On: Saturday, March 11, 2023, 16:24 [IST]
English summary
Top 5 suvs sold in india in february 2023
Read more on: #కారు #car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+