హోండా ఫేస్ లిఫ్ట్ కారు ఫీచర్స్ అదరహో..!

కార్ల కంపెనీలు మార్చి నెలలో కొన్ని అప్ డేట్స్, సరికొత్త ఫీచర్లతో విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవలే హోండా సిటీ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ను విడుదల చేసింది. ఈ జపనీస్ సెడాన్ తాజా కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు మీ కోసం అందిస్తున్నాం.

డిజైన్ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న మార్పులతో 2023 వెర్షన్ ని విడుదల చేసింది. కార్బన్ ర్యాప్డ్ డిఫ్యూజర్‌ తో కొత్త రియర్ బంపర్‌ తో ఈ రానుంది. రీప్రొఫైల్డ్ ఫ్రంట్, స్లిమ్మెర్ క్రోమ్ స్లాట్, స్పోర్టియర్‌ గా కనిపించే హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త స్పాయిలర్ లు ఆకట్టుకోనున్నాయి.

హోండా సిటీ కారు

ఫీచర్ల పరంగా ఈ కారును సరికొత్తగా ఆధునీకరించారని చెప్పవచ్చు. ADAS ఫీచర్లలోని అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లీడ్ కార్ డిపార్చర్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ వంటి క్రియాశీల భద్రతా ఫీచర్లను ఈ కారుకు జతచేశారు. మాన్యువల్ వేరియంట్‌ లలో కూడా ఈ ADAS టెక్ ఫీచర్లను అందిస్తుంది.

ఈ ఫీచర్లు అదుర్స్..

సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ లో 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్‌ లు, యాంబియంట్ లైటింగ్, లెథెరెట్ అప్‌హోల్స్‌ టరీ, LED హెడ్‌ లైట్లు అధునాతన ఫీచర్లు కారుకు కొత్త లుక్ ను అందిచనుంది. సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్ లాంటి కీలక ఫీచర్లు మనం పొందవచ్చు.

హోండా సిటీ

నూతన పర్యావరణ ప్రమాణాలకు అనుకూలంగా BS 2 ఉద్గార ప్రమాణాలు E20 ఇంధనానికి అనుగుణంగా ఉండే రెండు ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. బేస్ 1.5-లీటర్, సహజ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో ఈ కారు వస్తుంది. 120bhp వద్ద 145Nm టార్క్‌ ను ఈ కారు ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌ తో కలిగి ఉంది. హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ కారు 97bhp, 1.5-లీటర్ అట్కిన్సన్ ఇంజన్ 108bhp ఎలక్ట్రిక్ మోటార్ లతో పనిచేస్తుంది. ఈ హైబ్రిడ్ కారు 125bhp వద్ద 253Nm గరిష్ట టార్క్‌ ని చేరుకుంటుంది.
హోండా సిటీ కారు ఫీచర్లు

పవర్ ఫుల్ ఇంజన్ తో పనిచేయనున్న హోండా సిటీ..

ఇంధన సామర్థ్యం పరంగా, మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో కూడిన హోండా సిటీ పెట్రోల్-ఓన్లీ వెర్షన్ కారు 17.8km/l మైలేజ్ ను అందిస్తుంది, CVT వేరియంట్ 18.4km/l మైలేజ్ ను ఇస్తుంది. ఇక హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 27.13 కి.మీ. వరకు ఇవ్వగలగుతుందని కంపెనీ పేర్కొంది. మైలేజ్ పరంగా సెడాన్ లో గొప్ప కార్లుగా వీటిని భావించవచ్చు.

మంచి లుక్ తో పాటు.. తక్కువ ధరలో అందుబాటులో ఉండటం..

2023 హోండా సిటీ సెడాన్ కొత్తగా ప్రవేశపెట్టిన ఎంట్రీ-లెవల్ 'SV' ట్రిమ్‌తో సహా 4 వేరియంట్లలో అందించబడుతుంది. హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్ గతంలో కేవలం ZX ట్రిమ్‌ కు మాత్రమే ఉండేది. అయితే ఈ పవర్‌ట్రెయిన్ ఇప్పుడు V, VX మరియు ZXతో సహా 3 ట్రిమ్ స్థాయిలలో అందుబాటులోకి వచ్చింది. బేస్ వేరియంట్ లో ADAS ఫీచర్లు అందించడం సంస్థకు కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు.

2023 హోండా సిటీ ధరలు రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నాయి. ADAS టెక్‌ తో కూడిన V వేరియంట్ ధర రూ. 12.37 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. తక్కువ ధర వద్ద ADAS ఫీచర్లను అందించడం వల్ల ఎదురులేని సెడాన్ గా నిలువనుంది.


More from DriveSpark

Article Published On: Monday, March 6, 2023, 15:45 [IST]
English summary
Top 5 things about the new 2023 honda city design its advanced features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+