త్వరలో లాంచ్‌ కానున్న బెస్ట్‌ ఫ్యామిలీ కార్లు ఇవే.. తక్కువ ధర, అధిక మైలేజ్‌, అద్భుతమైన ఫీచర్లు.!!

భారత్‌లో చిన్న కార్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. సరసమైన ధరలో లభిస్తూ ఫ్యామిలీ కార్లు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో కార్‌ మేకర్లు సరికొత్త మోడళ్లు, అప్‌డేట్లతో ముందుకు వస్తున్నాయి. త్వరలో ఫీచర్‌-ప్యాక్డ్‌ ఫ్యామిలీ వాహనాల డిమాండ్‌ను తీర్చేందుకు కొన్ని ప్రముఖ బ్రాండ్ల నుంచి కొత్త కార్లు లాంచ్‌ కానున్నాయి.

ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి కారు నిత్యావసరంగా మారిపోయింది. ప్రధానంగా చిన్న కుటుంబాలు 5- సీటర్‌ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ. 10 లక్షల ప్రారంభ ధరతో మారుతి సుజుకి, కియా, మహీంద్రా, టాటా ఇంకా టయోటా బ్రాండ్ల నుంచి రాబోతున్న కొత్త మోడల్‌ కార్ల గురించి ఈ కథనంలో మీకు అందిస్తున్నాం.

Suzuki-Swift

Next Gen Maruti Swift: మారుతి సుజుకి ఇటీవలే 2023 జపాన్ మొబిలిటీ షోలో మినీ కూపర్‌ను గుర్తుకు తెచ్చేలా కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ను పరిచయం చేసింది. షార్ప్‌ ఫ్రంట్‌తో పాటు రీడిజైన్డ్‌ గ్రిల్‌, అప్‌డేటెడ్‌ హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌తో రాబోతుంది. కొత్త స్విఫ్ట్‌లో అప్‌డేటెడ్‌ 1.2 లీటర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ను అందిస్తున్నారు. పనితీరు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా అధిక మైలేజ్‌ను ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.

Next Gen Maruti Dzire: భారత మార్కెట్లోకి కొత్త స్విఫ్ట్‌తో పాటు 4వ తరం మారుతి సుజుకి డిజైర్ కూడా విడుదల కానుంది. ఇందులో స్విఫ్ట్‌లో మాదిరి కొన్ని స్పెసిఫికేషన్‌లు ఉండనున్నాయి. కొత్త డిజైర్‌లో కొత్త 1.2-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. సరికొత్త డిజైన్‌తో పాటు మెరుగైన ఫీచర్‌లతో డిజైర్‌ కొత్త బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేయనుంది.

Mahindra-XUV-300

New Mahindra XUV Facelift: భారత మార్కెట్లో మహీంద్రా XUV300 కి ఎస్‌యూవీలో కూడా భారీ మార్పులు చేయనున్నారు. 2024 త్రైమాసికంలో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పై చిత్రాల ద్వారా కొత్త LED టైల్‌లైట్ క్లస్టర్, హెడ్‌ల్యాంప్‌లతో ఎక్స్‌టీరియర్‌ను మోడిఫై చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటీరియర్‌ ఫీచర్లలోను ఆధునికంగా పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. సబ్‌ 4 మీటర్‌ SUV సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

Tata Punch EV: స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌.. తన లైనప్‌ను పంచ్ EVతో మరింతగా విస్తరించనుంది. త్వరలో పంచ్‌ ఈవీని లాంచ్‌ చేయనుంది. ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా పలు ఫీచర్లను అప్‌డేట్‌ చేయనున్నట్లుగా స్పై చిత్రాల ద్వారా వెల్లడవుతోంది. బ్యాటరీ విషయానికొస్తే.. పంచ్ EV 500 కి.మీల రేంజ్‌ను ఇవ్వొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Tata-Punch-EV

Toyota Taisor: టయోటా మోటార్స్‌ నుంచి త్వరలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కాంపాక్ట్ SUV వెర్షన్‌ టైజర్‌ పరిచయం కానుంది. మారుతి సుజుకి, టయోటా మోటార్స్‌ బ్రాండ్ల మధ్య సహకారంతో టయోటా టైజర్‌ విడుదల కానుంది. ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ పరంగాను టయోటా.. టైజర్‌లో ఆకర్షణీయమైన మార్పులు చేయనుంది. అయితే ఇంజిన్‌ ఆప్షన్స్‌ మాత్రం Maruti Fronx మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం.

Kia Sonet Facelift: 2020 లో కియా సోనెట్‌ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి కస్టమర్లకు బెస్ట్‌ ఆప్షన్‌గా నిలిచింది. ఇప్పుడు కియా సోనెట్‌ మిడ్-లైఫ్‌సైకిల్ ఫేస్‌లిఫ్ట్ రానుంది. స్పై చిత్రాల ద్వారా ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, హెడ్‌ల్యాంప్ అసెంబ్లీ, అల్లాయ్ వీల్స్, కారు వెనుక భాగాలు సైతం రీడిజైన్ చేయబడినట్లుగా తెలుస్తోంది. కియా సోనెట్‌లో ఇంటిరీయర్‌ అప్‌డేట్‌ అయి ఉండే అవకాశం ఉంది. అయితే ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.

New-Family-Cars-Launching

More from DriveSpark

Article Published On: Monday, November 27, 2023, 12:27 [IST]
English summary
Top 6 family cars at low price launching soon in india swift to kia sonet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+