భారత్‌లో తొలిసారి క్రాష్ టెస్ట్.. ఈ 7 కార్లకు ఎంత స్టార్ రేటింగ్ రానుందో.??
కార్లలో క్రాష్ టెస్ట్, సేఫ్టీ రేటింగ్ కోసం ఇటీవల భారత ప్రభుత్వం భారత్ NCAP ను ప్రవేశపెట్టిన సంగతి తెెలిసిందే. ఇకపై తయారీ కంపెనీలు సేఫ్టీ రేటింగ్ కోసం తమ కార్లను గ్లోబల్ NCAP కి పంపించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే క్రాష్ టెస్ట్ చేసుకోవచ్చు. తద్వారా కస్టమర్లు తమకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు.
భారత్ NCAP తో జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, లాటిన్ అమెరికా వంటి తమ సొంత ఎన్‌సీఏపీ దేశాల సరసన భారత్ కూడా చేరింది. దేశంలో రోడ్డు భద్రత మరియు కారు భద్రతను పరీక్షించే దిశగా భారత్ NCAP ఒక కీలక అడుగు. అయితే భారత్ NCAPలో మనం చూడాలనుకుంటున్న అత్యంత ప్రజాదరణ పొందిన ఏడు కార్ల జాబితాను ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.

మారుతీ ఫ్రాంక్స్: ప్రముఖ ఆటో మేకర్ మారుతి సుజుకి నుంచి తాజాగా విడుదలైన మారుతి ఫ్రాంక్స్.. ఇప్పటికే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. మారుతి ఫ్రాంక్స్ మోడల్‌ను గతంలో క్రాష్ టెస్ట్ చేయబడిన బాలెనో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించారు.
కాగా దీనికి జీరో-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చారు. కానీ కొత్త మారుతి ఫ్రాంక్స్ ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)తో వస్తున్నాయి. ఈ రెండు ఫీచర్లు కూడా మారుతి ఫ్రాంక్స్ మంచి స్టార్ రేటింగ్ స్కోర్ చేయడంలో సహాయపడతాయి.

మారుతి గ్రాండ్ విటారా: కొత్తగా విడుదల చేసిన కొత్త మారుతి గ్రాండ్ విటారా ఇప్పటికే చాలా ప్రజాదరణ పొందింది. ఈ SUVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
మారుతి డిజైర్ : మారుతి డిజైర్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్లలో ఒకటి. ఈ మోడల్ ప్రతి నెలా సగటున 11,000 యూనిట్ల విక్రయాలు అవుతున్నాయి. మారుతి స్విఫ్ట్‌కు గ్లోబల్ NCAPలో క్రాష్ టెస్ట్ నిర్వహించగా కేవలం 1 స్టార్ సేఫ్టీ రేటింగ్ మాత్రమే సాధించింది. మరి మారుతి డిజైర్ భారత్ NCAP క్రాష్-టెస్ట్‌లో ఎంత రేటింగ్ సాధిస్తుందో చూడాలి..

హ్యుందాయ్ వెన్యూ: హ్యుందాయ్ వెన్యూ దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-4 మీటర్ల SUVలలో ఒకటి. ఈ సబ్‌కాంపాక్ట్ SUV ఆస్ట్రేలియన్ NCAPలో క్రాష్ టెస్ట్ చేయగా.. 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. అయితే దాని ఇండియా-స్పెక్ వెర్షన్‌పై ఇంకా క్రాష్ టెస్ట్ నిర్వహించలేదు. మరి భారత మార్కెట్‌లో కూడా ఇదే మంచి రేటింగ్‌ను అందుకుంటుందో లేదో తెలియనుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్: భారత మార్కెట్లో మరో సరికొత్త మోడల్ హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇప్పటికే బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ మైక్రో SUV గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో నిరుత్సాహకర పనితీరును అందించింది. ప్రామాణిక భద్రతా ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఎక్స్‌టర్ ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

టయోటా ఇన్నోవా క్రిస్టా: టయోటా ఇన్నోవా క్రిస్టా ASEAN NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ మరియు ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఎన్ని స్టార్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

మహీంద్రా బొలెరో: మహీంద్రా నుండి రగ్గడ్ మరియు బాక్సీ SUV బొలెరో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌లలో ఒకటి. ఇటీవలి సంవత్సరాలలో, మహీంద్రా తన కార్ల భద్రతను మెరుగుపరచడంలో చాలా పురోగతి సాధించింది. XUV 700 మరియు స్కార్పియో N గ్లోబల్ NCAP లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. బొలెరో నుంచి కూడా భారత్ NCAP ద్వారా ఇదే విధమైన భద్రతా రేటింగ్‌ను ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications








