2023 ఆటో ఎక్స్‌పోలో కన్నుల విందు చేసిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు, వాటి వివరాలు
2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు CNG వాహనాలు అధిక సంఖ్యలో ప్రదర్శించబడ్డాయి. అయితే ఈ 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఎలక్ట్రిక్ వాహనాల్లో టాప్-5 ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఐయోనిక్ 5:
ప్రముఖ వాహన తయారీ సంస్థ అయినా హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. అయితే 2023 ఆటో ఎక్స్‌పోలో ధరలను అధికారికంగా వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 44.95 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు మొదటి 500 మంది కస్టమర్లలకు మాత్రమే వర్తిస్తాయి. కావున మొదట్లో కొనుగోలు చేసే 500 మంది కష్టమరలకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 214 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 350kw DC ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

కియా 'EV9':
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ తన కియా ఈవి 9 ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. దీని ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 2023 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కియా EV9 కాన్సెప్ట్ చూడటానికి చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది సాధారణ మోడల్స్ మాదిరిగా కాకుండా ఒక చతురస్రాకార రూపాన్ని కలిగి ఉండటం ఇక్కడ చూడవచ్చు.

కియా EV9 కాన్సెప్ట్ లో 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. అయితే రేంజ్ మరియు పర్ఫామెన్స్ వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో అధికారికంగా వెల్లడికానున్నాయి. అయితే డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా ప్రదర్శనలో కనిపించిన మోడల్ మాదిరిగానే ఉంటాయి. అయితే దీని సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మారుతి సుజుకి eVX కాన్సెప్ట్:
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' '2023 ఆటో ఎక్స్‌పో' లో తన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUV eVX నిప్రదర్శించింది. కొత్త eVX కాన్సెప్ట్ మరో రెండు సంవత్సరాల్లో మార్కెట్లో అడుగుపెట్టనుంది. మారుతి సుజుకి eVX అనేది ఒక ఆల్-ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUV కావున ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులోని 60 kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 550 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది మార్కెట్లో లాంచ్ అయినా తరువాత ఖచ్చితమైన పరిధి తెలుస్తుంది. అయితే తప్పకుండా ఈ ఎలక్ట్రిక్ SUV 500 కిమీ పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము.

బివైడి సీల్:
భారతీయ మార్కెట్లో BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) 2023 ఆటో ఎక్స్‌పోలో తన సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్ 'సీల్' ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా మోడల్ 3 కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ సెడాన్ యొక్క డెలివరీలు 2023 నాల్గవ త్రైమాసికంలో లేదా 2023 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
BYD సీల్ కంపెనీ యొక్క ఇ-ప్లాట్‌ఫారమ్ 3.0 పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. అవి ఒకటి 61.4 కిలోవాట్ యూనిట్, మరొకటి 82.5 కిలోవాట్ యూనిట్. మొదటి బ్యాటరీ ప్యాక్ (61.4 కిలోవాట్ యూనిట్) ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 550 కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో రెండవ బ్యాటరీ ప్యాక్ (82.5 కిలోవాట్ యూనిట్) ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 700 కిమీ పరిధిని అందిస్తుంది.

టాటా హారియర్ EV:
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా తన కొత్త 'హారియర్ EV కాన్సెప్ట్' ఆవిష్కరింది. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన హారియర్ EV కాన్సెప్ట్ మోడల్ 2024 నాటికి విక్రయానికి రానున్నట్లు సమాచారం.

టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారులో 60 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ బ్యాటరీ ఫ్యాక్స్ కంటే కొంత పెద్దదిగా ఉంటుంది, కావున రేంజ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 400 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉంటుందని భావించవచ్చు. అయితే ఇంకా ఖచ్చితమైన గణాంకాలు వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








