Budget Cars: తక్కువ ధరలో లభించే బెస్ట్ కార్లు.. ఫీచర్స్, మైలేజ్ & డిజైన్ వివరాలు
భారతీయ కస్టమర్లు ఎక్కువగా స్టైలిష్ లుక్ తో పాటు సరసమైన ధరలో లభించే కార్లను ఇష్టపడతారు. కారులో లభించే ఫీచర్లతో పాటు ధరను కూడా బేరీజు వేసుకుని కొనుగోలు చేస్తారు. . అందులోనూ భారతదేశంలో మధ్యతరగతి జనాభా పెరుగుతున్నందున సౌకర్యవంతమైన జీవనశైలి కోసం వారి డిమాండ్ కి అనుగుణంగా బడ్జెట్ కార్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ రోజుల్లో వ్యక్తిగత వాహనం కలిగి ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి కార్లను కొనేందుకు జనాలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. మార్కెట్ లో ప్రస్తుతం తక్కువ ధరలో చాలా కంపెనీలు కార్లను విక్రయిస్తున్నాయి. మారుతి, టాటా కంపెనీల నుంచి ఊహించిన బడ్జెట్ లో సాధరణ జనాలకు అందుబాటులో ఉన్న కార్ల జాబితా మీకోసం..

ఆల్టో K10..
ముందుగా ఈ జాబితాలో ఉన్న కారు ఆల్టో K10. భారతదేశంలో మారుతి సుజుకి నుంచి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఈ కారు చాలా సంవత్సరాలుగా ప్రజాదరణ పొందింది. ఇది ఉత్తమ డిజైన్, పర్ఫామెన్స్ ని కలిగి ఉంది. రద్దీగా ఉండే పట్టణ రహదారులపై సులభంగా ఈ కారును నడపవచ్చు. కేవలం రూ.3.99 లక్షల నుంచి రూ.5.95 లక్షల (ఎక్స్-షోరూమ్)లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
లీటర్ కి ఇది 24.39 - 24.9 మైలేజీని అందిస్తుంది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ఇంజన్ 1-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో 67 PS పవర్ వద్ద 89 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్ తో వస్తుంది. 7 ఇంచెస్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో ఈ కారు వస్తుంది.
మారుతి సెలెరియో..
మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో సరసమైన కారు 'సెలెరియో'. ఈ కారు కూడా భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. రూ.5.35 లక్షల నుంచి రూ.7.13 లక్షల ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ కారు ఆరు ఎంపిన చేసిన కలర్లలో రానుంది. ఈ కారు 24.97 - 26.68 kmpl మైలేజీని అందిస్తుంది. ఆటోమేటిక్ తో పాటు మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఎంపికతో ఈ కారు వస్తుంది.
టాటా టియాగో..
ఈ జాబితాలో లభించే మరో కారు టాటా టియాగో. చాలా తక్కువ ధరలో అద్భుతమైన లుక్ లో 'టియాగో' హ్యాచ్‌బ్యాక్‌ను సంస్థ అందిస్తోంది. కొత్త టాటా టియాగో ప్రారంభ ధర రూ. 5.54 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 5 కలర్ ఆప్షన్లతో పాటు ఆరు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది పెట్రోల్/CNG ఇంజన్ ఆప్షన్లతో రానుంది.
ఈ కారు 19.0 - 19.01 kmpl మైలేజీని అందిస్తుంది. అధునాతన ఫీచర్లను ఈ కారులో జోడించారు. వీటిలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లు, అరుదైన పార్కింగ్ సెన్సార్లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) కలిగి ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్..
ఈ జాబితాలోని మరో కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్. దీని ధర రూ. 5.73 లక్షల నుంచి రూ. 8.51 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది గరిష్టంగా 83 PS వద్ద 114 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ తో పాటు AMT గేర్‌బాక్స్ ఎంపికతో ఈ కారు లభిస్తుంది.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ దేశంలోని ప్రతి కస్టమర్ అమితంగా ఇష్టపడే మరో కారు. ఈ రెనాల్ట్ క్విడ్ రూ.4.70 లక్షల నుంచి రూ.6.33 లక్షల ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లీటర్ కి 21.46 - 22.3 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ కారు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో పాటు మరిన్నీ ఇతర అధునాతన ఫీచర్లతో కంపెనీ తీసుకువచ్చింది.


Click it and Unblock the Notifications








