2023 లో అత్యధిక మైలేజ్‌తో లాంచ్ అయిన కార్లు ఏవో తెలుసా.. ఈ కార్లలో లీటర్‌కు 23 కి.మీ వెళ్లొచ్చు.!!
దేశంలో కార్ల వినియోగం పెరుగుతోంది. ఫ్యామిలీ, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా చాలా మందికి కారు ప్రధానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కారు కొనేముందు చాలా మంది కొన్ని ఫీచర్లు తప్పక ఉండేలా చూసుకుంటారు. అందులో ముఖ్యమైనది మైలేజ్.. ఈ సంవత్సరం అధిక మైలేజ్‌తో విడుదలైన బెస్ట్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
2023లో ఆటో మొబైల్ రంగంలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఐసీఈ కార్లతో పాటు ఎలక్ట్రిక కార్లకూ ఈ సంవత్సరం డిమాండ్ ఎక్కువగానే ఉంది. ప్రముఖ కంపెనీలు పోటాపోటీగా అధునాతన కార్లను విడుదల చేశాయి. ఈ క్రమంలో మారుతి, హోండా, హ్యుందాయ్, క్రెటా సంస్థల నుంచి మంచి మైలేజ్‌తో కార్లు అందుబాటులోకి వచ్చాయి.

మారుతీ సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto): టయోటా భాగస్వామ్యంతో భారత మార్కెట్లో ఈ ఏడాది లాంచ్ అయిన రీబ్యాడ్జ్డ్ మోడల్ మారుతి సుజుకి ఇన్విక్టో. టయోటా ఇన్నోవా హైక్రాస్ రీబ్యాడ్జ్ మోడల్ ఇది. ఇన్విక్టో లీటర్‌కు 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఫుల్‌ట్యాంక్‌పై ఒకేసారి 52 లీటర్ల పెట్రోల్‌ను ఫిల్ చేయవచ్చు. ధర రూ. 24.82 లక్షల నుంచి 28.42 లక్షల వరకూ ఉంది.
హ్యుందాయ్ వెర్నా(Hyundai Verna): భారత మార్కెట్లో మారుతి సుజుకి ఇన్విక్టో తర్వాత అత్యధిక మైలేజ్‌తో విడుదలైన కారు మోడల్ హ్యుందాయ్ వెర్నా. ఇది లీటర్ పెట్రోల్‌కు 18.60 కి.మీ నుంచి 20.6 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ కారులో లెవెల్ 2 అడాస్ ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ వెర్నా కారును సంప్రదాయ పెట్రోల్ మరియు టర్బో ఇంజిన్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్(Hyundai Exter): వెర్నా తర్వాత హ్యుందాయ్ నుంచి అధిక మైలేజ్‌తో మరో కారు విడుదలైంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ లీటర్‌కు 19.20 కి.మీ నుండి 19.40 కి.మీల మైలేజీని ఇస్తుంది. భారత మార్కెట్లో బడ్జెట్ ధర కలిగిన కార్ మోడళ్లలో ఒకటైన ఎక్స్‌టర్ ప్రారంభ ధర రూ. 6 లక్షలుగా ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను CNG ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. సీఎన్‌జీ వెర్షన్ గరిష్ఠంగా 27.10 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ కారు టాటా పంచ్‌కు గట్టి పోటీగా విడుదలైంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీగా లాంచ్ అయింది.

కియా సెల్టోస్(Kia Seltos): కియా మోటార్స్ నుంచి ఈ ఏడాది విడుదలైన మరో అద్భుతమైన కారు కియా సెల్టోస్.. ఈ కారు రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ మోటార్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు లీటరుకు 17 కి.మీ నుండి 17.7 కి.మీ మైలేజ్‌ని అందిస్తాయి.
ఇటీవల కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్(Kia Seltos Facelift) కూడా విడుదలైంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ అందుబాటులో ఉంది. పైన పేర్కొన్న కార్ మోడళ్ల మాదిరిగానే భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఎస్‌యూవీలలో కియా సెల్టోస్ కూడా ఒకటి.

హోండా ఎలివేట్(Honda Elevate): ఈ సంవత్సరం భారతదేశంలో విక్రయించబడిన అత్యధిక మైలేజ్ కార్ల జాబితాలో హోండా ఎలివేట్ చివరి స్థానంలో నిలిచింది. ఎందుకంటే ఈ కారు లీటర్‌కు 15.31 kmpl నుండి 16.92 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 11.00 లక్షలుగా ఉంది. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి.


Click it and Unblock the Notifications








