భారత్‌లో అధిక మైలేజ్ ఇచ్చే మిడ్ సైజ్ SUVలు..!!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVల విక్రయాలు అధికంగా ఉంటున్నాయి. మిడ్ సైజ్ ఎస్‌యూవీలు కూడా అధికంగా విక్రయాలు నమోదు చేసుకుంటున్నాయి. అయితే కార్ల ఎంపికలో ధర, మైలేజ్ ఇతర సెక్యూరిటీ ఫీచర్లు కీలకంగా మారుతున్నాయి. మిడ్‌సైజ్ SUV పెట్రోల్ వేరియంట్ అధిక మైలేజ్ కార్ల కోసం చూస్తున్నట్లయితే ఈ కథనం మీకోసం.
ARAI గణాంకాల ఆధారంగా అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ మిడ్‌సైజ్ జాబితాను రూపొందించాము. అయితే డ్రైవింగ్ పరిస్థితి బట్టి మైలేజీలో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇంజన్లు కలిగి ఉంటే ఆ రెండింటి మైలేజీని సగటున లెక్కించాము.

మారుతి గ్రాండ్ విటారా/ టయోటా హైరైడర్ : మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ ఈ రెండు ఎస్‌యూవీలు 1.5 లీటర్ 4 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడతాయి. e CVT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి. ఈ హైబ్రిడ్ కారు 27.96 kmpl మైలేజిని అందిస్తుంది.
మారుతి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. ఈ రెండు 21.12 kmpl మైలేజీని అందిస్తాయని ఏఆర్‌ఏఐ క్లెయిమ్ చేస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్‌లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా పొందుతారు.

వోక్స్‌వ్యాగన్ టైగన్ : వోక్స్‌వ్యాగన్ టైగన్ ఎంట్రీ లెవల్ ఇంజిన్ 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఐడిల్ స్టార్ట్/ స్టాప్ టెక్నాలజీతో వస్తుంది. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు సగటున 18.23kmpl మైలేజీని ఇస్తుంది.
వోక్స్‌వ్యాగన్ టైగన్ 1.5 ఇంజిన్ : వోక్స్‌వ్యాగన్ టైగన్ 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ DCT వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లు సగటున 18.18 kmpl మైలేజీని ఇస్తాయి. ఐడిల్ స్టార్ట్/ స్పాప్, సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

స్కోడా కుషాక్ 1.5 : స్కోడా కుషాక్ 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ మోటార్‌ను కలిగి ఉంటుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. ఈ కారు 17.83 kmpl మైలేజీని అందిస్తుంది. ఐడిల్ స్టార్ట్/ స్టాప్, సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
కియా సెల్టోస్ 1.5 టర్బో : కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6 స్పీడ్ iMT లేదా 7 స్పీడ్ DCTతో అందించబడుతుంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో శక్తవంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. కియా సెల్టోస్ 2023 కారు 17.8 kmpl మైలేజీని అందిస్తుంది.

కియా సెల్టోస్ 1.5 ఇంజిన్ : కియా సెల్టోస్ కారు 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఆ కారు 17.35kmpl మైలేజీని ఇస్తుంది.
హ్యుందాయ్ క్రెటా 1.5 : హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు సగటున 16.85 kmpl మైలేజీని అందిస్తాయి.

స్కోడా కుషాక్ 1.0 : స్కోడా కుషాక్ 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఎంట్రీ లెవల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. కానీ ఇంజిన్ పనితీరు ఆకట్టుకుంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. 16.83 kmpl మైలేజీని అందిస్తుంది. ఐడిల్ స్టార్ట్/ స్టా్ప్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
హోండా ఎలివేట్ : హోండా ఎలివేట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అధికారికంగా ధరలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. ఈ కారు 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 6 స్వీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు 16.11 kmpl మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








